ఇటు ‘సౌత్’.. అటు ‘నార్త్’: వరుస చిత్రాలతో.. జోరుగా హుషారుగా.. రకుల్ ప్రీత్ సింగ్!

- Advertisement -

హైదరాబాద్: వరుస చిత్రాలతో మంచి జోరు మీద ఉంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం ఆమె చేతిలో దాదాపు అర డజనుకు పైగానే చిత్రాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇటు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ ‘టాలీవుడ్‌’లోనే కాక అటు నార్త్ ఫిల్మ్ ఇండస్ట్రీ ‘బాలీవుడ్‌’‌లోనూ నటిస్తూ రకుల్ మంచి క్రేజ్ తెచ్చుకుంది.

ఇప్పటికే రకుల్ బాలీవుడ్‌లో ‘థ్యాంక్ గాడ్’, ‘మేడే’, ‘అటాక్’ తదితర చిత్రాలలో నటిస్తోంది. మరోవైపు ఇటు టాలీవుడ్‌లో వైష్ణవ్ తేజ్ హీరోగా.. క్రిష్ దర్శకత్వంలో ఆమె నటించిన చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే ప్రస్తుతం రకుల్ బాలీవుడ్ చిత్రాల జాబితాలో మరో సరికొత్త చిత్రం వచ్చి చేరింది. ఈ చిత్రం పేరు ‘డాక్టర్ జి’. ఈ చిత్రంలో ఆమె సరసన కథానాయకుడిగా బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా నటించనున్నారు.

అనుభూతి కశ్యప్ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ‘డాక్టర్ జి’ చిత్రాన్ని నిర్మాణ సంస్థ జంగ్లీ పిక్చర్స్ నిర్మించనుంది. ఇదొక వైవిధ్యభరితమైన కథాంశంతో కూడిన చిత్రం.

ఈ సినిమా చిత్రీకరణ వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్నట్లు హీరో హీరోయిన్లు రకుల్, ఆయుష్మాన్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు. ప్రస్తుతం స్క్రిప్ట్ చదవడం ప్రారంభించినట్లు పేర్కొన్నారు.

‘డాక్టర్ జి’ చిత్రంలో కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా గైనకాలజిస్ట్ వైద్య విద్యార్థిగా ఉదయ్ గుప్తా అనే పాత్రలో నటిస్తుండగా, రకుల్ ఆయనకు జూనియర్‌ డాక్టర్‌గా ఫాతిమా అనే వైద్య విద్యార్థిని పాత్రలో కనిపించనుంది.

 

- Advertisement -