27.2 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home అంతర్జాతీయం ఇంత అన్యాయమా? చెల్లించాల్సింది రూ.9 వేల కోట్లైతే రూ.13 వేల కోట్లు జప్తు చేస్తారా?: మాల్యా...

ఇంత అన్యాయమా? చెల్లించాల్సింది రూ.9 వేల కోట్లైతే రూ.13 వేల కోట్లు జప్తు చేస్తారా?: మాల్యా రోదన

vijay mallay
- Advertisement -

vijay mallya

లండన్: లిక్కర్ కింగ్, ప్రముఖ వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా రూ. 9వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. స్వదేశానికి తిరిగి రావాలని కోరినప్పటికీ రాకపోవడంతో మాల్యాకు సంబంధించిన దాదాపు రూ.13వేల కోట్ల ఆస్తులను దర్యాప్తు సంస్థలు జప్తు చేశాయి.

ఈ నేపథ్యంలో దర్యాప్తు సంస్థలను ఉద్దేశించి విజయ్ మాల్యా స్పందిస్తూ.. ఇంత అన్యాయమా? న్యాయం ఎక్కడుంది? అంటూ ట్విట్టర్ వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేశారు. అంతేగాక, తాను చెల్లించాల్సిన రుణాలు రూ.9వేల కోట్లు అయితే.. దర్యాప్తు సంస్థలు ఇప్పటికే రూ.13వేల కోట్ల ఆస్తులను జప్తు చేశాయని..ఇది ఇంకా ఎంత దూరం వెళ్లనుందని మాల్యా ప్రశ్నించారు.

మాల్యా ట్వీట్‌పై నెటిజన్ల సెటైర్లు

తాను చెల్లించాల్సిన రుణం వడ్డీతో సహా రూ.9వేల కోట్లు అని బ్యాంకులు చెప్తుంటే.. దర్యాప్తు సంస్థలు మాత్రం 13వేల కోట్ల విలువగల ఆస్తులను జప్తు చేశాయన్నారు. ఇది న్యాయమేనా? అని మాల్యా ట్వీట్‌ చేశారు. దీంతో నెటిజన్లు మాల్యాను ఉద్దేశించి తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు.

వెంటనే స్వదేశానికి వచ్చి.. అప్పు తీర్చేసి వెళ్లిపో లేదంటే.. నీ స్విస్ బ్యాంక్ ఖాతాలోని కూడా స్వాధీనం చేసుకుంటారని.. ఇది నయా భారత్ అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. ఇలా చేస్తేనే నీ తిక్క కుదురుద్దు అంటూ మరికొందరు నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా, ఆర్థిక నేరగాళ్ల చట్టం కింద పారిపోయిన మొదటి నేరస్థుడిగా మోడీ ప్రభుత్వం మాల్యాను ప్రకటించిన విషయం తెలిసిందే.

 

 

 

- Advertisement -