కార్ల డీలర్ ఉసురు తీసిన ఆర్థిక మాంద్యం

- Advertisement -

చెన్నై: లాన్సన్ టొయోటా డీలర్‌షిప్ కంపెనీకి చెందిన మహిళా వ్యాపారవేత్త రీటా లంకలింగం ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక మాంద్యం కారణంగా కార్ల అమ్మకాలు తగ్గి నష్టాలు వచ్చాయని, అందుకే ఆమె ఆత్మహత్య చేసుకున్నారని అనుమానిస్తున్నారు.

స్థానిక నుంగంబాక్కం కోథారీ రోడ్డులో లంకలింగం, రీటా దంపతులు నివసిస్తున్నారు. లంకలింగం తమిళనాడులో టోయోటా కార్లకు డీలర్‌గా వ్యవహరిస్తున్న లాన్సన్ సంస్థ ఛైర్మన్‌గా, రీటా జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తూ దేశవ్యాప్తంగా కంపెనీ శాఖలను విస్తరింపచేస్తున్నారు.

రోజూ ఉదయాన్నే 8 గంటల రెడీ అయి ఆఫీసుకు వెళ్లే.. ఆమె 11 గంటలైనా గదిలోనుంచి అలికిడి రాకపోవడంతో పనిమనిషి నుంగంబాక్కం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. గదిలో రీటా ఫ్యాన్‌కి ఊరేసుకుని కనిపించారు. విచారణ చేపట్టిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

అయితే రెండు, మూడు రోజులుగా ఆమె మనోవేదనతో విచారణలో తేలింది. భర్తతో ఏమైనా గొడవలు ఉన్నాయా..? లేక వ్యాపారంలో నష్టాలు రావడంతోనే ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

- Advertisement -