షాకింగ్: బిగ్ బీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్… పాక్, టర్కీ ఫ్లాగ్స్ పోస్ట్!

- Advertisement -

హైదరాబాద్: సెలబ్రిటీల సోషల్ మీడియా ఎకౌంట్స్ కు హ్యాకింగ్ హెడేక్ పట్టుకుంది. ఇటీవల చాలా మంది పాపులర్ సెలబ్రిటీల ఎకౌంట్స్ హ్యాక్ అవ్వగా… ఇప్పుడు బిగ్ బి అమితాబచ్చన్ ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది.

చదవండి: సరికొత్త టైటిల్‌తో సంక్రాంతి బరిలో బాలయ్య…

టర్కీకి చెందిన అయ్యిల్డిజ్ టిమ్ అనే హాకింగ్ గ్రూప్ అమితాబ్ ట్విట్టర్ అకౌంట్ ను టార్గెట్ చేసి.. హ్యాక్ చేసింది. అంతటితో ఊరుకోకుండా అకౌంట్ డిస్ ప్లే పిక్ చేంజ్ చేసింది. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఫోటో పెట్టి లవ్ పాకిస్తాన్ అని పోస్ట్ కూడా పెట్టింది.

ఇండియాలో ముస్లింల మీద దాడులు జరుగుతున్నాయని… ఊరుకోబోమని హెచ్చరించారు. పాకిస్తాన్, టర్కీ నేషనల్ ఫ్లాగ్స్ ను కూడా పోస్ట్ చేశారు. తన ట్విట్టర్ ఎకౌంట్ హ్యాక్ అయినట్లు వెల్లడించిన బిగ్ బీ…. తన సిబ్బంది అకౌంట్ రికవరీ పనుల్లో ఉన్నట్లు తెలిపారు.

- Advertisement -