
హైదరాబాద్: మిల్కీ బ్యూటి తమన్నా మెగాస్టార్ చిరంజీవి తో కలిసి నటిస్తున్న చిత్రం సైరా. బాహుబలి తర్వాత ఆమె నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఇదే. సినిమాలో యువరాణిగా కనిపించనున్న తమన్నా… తన డ్రెస్సింగ్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
చదవండి: మహేశ్ ఇమేజ్ వల్లే నిజం సినిమా ఫ్లాప్ అయింది: డైరెక్టర్ తేజ
యువరాణి పాత్ర కావడంతో లెహంగాలు ధరించాల్సి వచ్చిందని… సినిమాలో తన దుస్తులను చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత, అంజు మోదీ కలిసి డిజైన్ చేశారని తెలిపింది. తాను ఇప్పటి వరకు ధరించిన అత్యంత ఖరీదైన వస్త్రాలు కూడా ఇవేనంటూ చెప్పుకొచ్చింది.
ఇక బాలీవుడ్ విషయానికి వస్తే… తను రెండు రకాల చిత్రాల్లో నటించేందుకు ఆసక్తిగా ఉన్నానని తెలిపింది తమన్నా. బయోపిక్ సినిమాలపై ఇంట్రెస్ట్ ఉందని చెప్పిన ఆమె.. డ్యాన్స్ అంటే తనకు చాలా ఇష్టమని, ఆ నేపథ్యంలో సినిమాలు వస్తే ఒప్పుకుంటానని తెలిపారు.
తను సినిమాల్లోకి వచ్చేందుకు స్ఫూర్తినిచ్చిన అతిలోక సుందరి శ్రీదేవి పాత్రలో నటించాలని కూడా ఉందన్నారు తమన్నా. మొదటిసారి మెగాస్టార్‌తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడం కూడా చాలా ఆనందం కలిగించిందని తెలిపింది.








