25.2 C
Hyderabad
Friday, November 27, 2026
- Advertisement -
Home బాలీవుడ్ గుండెపోటుతో ప్రముఖ సినీ నటి కన్నుమూత.. విషాదంలో బాలీవుడ్ ఇండస్ట్రీ

గుండెపోటుతో ప్రముఖ సినీ నటి కన్నుమూత.. విషాదంలో బాలీవుడ్ ఇండస్ట్రీ

bollywood actress and stage artist usha ganguly dies at 75 in kolkata
- Advertisement -

ముంబై: ఒకవైపు దేశంలో కరోనా విజృంభణ గురించి అందరూ చింతిస్తుండగా బాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ, స్టేజ్ ఆర్టిస్ట్ ఉషా గంగూలీ గురువారం గుండెపోటుతో మరణించారు. 

దక్షిణ కోల్‌కతాలోని లేక్ గార్డెన్స్ ప్రాంతంలోని తన ఫ్లాట్‌లో ఆమె కన్నుమూశారు. గుండెపోటుతో ఒక్కసారిగా ఆమె కుప్పకూలడంతో చికిత్స నిమిత్తం వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

చదవండి: ఇంట్లో ఉండమంటే.. మాయమైంది! ఇంతకీ గాయని కనికా కపూర్ ఎక్కడున్నట్లు?

అయినా ఫలితం లేకపోయింది. ఉషా గంగూలీ వయసు 75 ఏళ్లు. సినీ, నాటక రంగానికి విశిష్ట సేవలందించిన ఆమె మృతికి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, లెజండరీ నటీమణులు షబానా ఆజ్మీ, అపర్ణాసేన్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. 

చిన్నతనంలోనే కళా రంగం పట్ల ఆకర్షితురాలై…

జోధ్‌పూర్‌లో జన్మించిన ఉషా గంగూలీ చిన్నతనంలోనే కళా రంగం పట్ల ఆకర్షితురాలై భరతనాట్యం నేర్చుకున్నారు. ఆ తరువాత ఆమె హిందీ లిటరేచర్ నేర్చుకోవడానికి కోల్‌కతా వెళ్లారు.

1976లో రంగ కర్మీ సంస్థ ద్వారా నాటక రంగంలోకి అడుగుపెట్టిన ఉషా గంగూలీ ఎన్నో సూపర్‌హిట్ నాటకాల్లో కీలక పాత్రలు ధరించి నటిగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. 

స్వయంగా ఆమె నిర్మాతగా, దర్శకురాలిగా మారి పలు నాటక ప్రదర్శనలు నిర్వహించడమేకాక.. నాటక రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు ఆమె తీసుకొచ్చారు. 

చదవండి: ఎన్టీఆర్-త్రివిక్రమ్ సెకండ్ మూవీ.. హీరోయిన్లుగా శృతి హాసన్, నివేత పేతురాజ్!?

ఉషా గంగూలీ దర్శకత్వంలో రూపొందిన ‘గుడియా ఘర్’ అనే నాటకానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సంగీత నాటక అకాడమీ అవార్డు ఇచ్చి సత్కరించింది.

ఇటు సినీరంగంలోనూ కేవలం నటిగానే కాక వివిధ విభాగాల్లోనూ ఆమె తన ప్రతిభ చాటుకున్నారు. అజేయ్ దేవగణ్ హీరోగా తెరకెక్కిన ‘రెయిన్‌కోట్’ సినిమాకు ఉషా గంగూలీ కథా సహకారం కూడా అందించారు.  

- Advertisement -