
అమరావతి: అందరూ ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది..దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలు, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడనున్నాయి. ఇక అన్నీ చోట్ల ఓట్ల లెక్కింపుకి సర్వం సిద్ధమైంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల లెక్కింపు కొద్ది సేపటిలో మొదలు కానుంది.
ఈ నేపథ్యంలో, కౌంటింగ్ ఏజంట్లుగా నియమించబడ్డ వారు అత్యంత జాగ్రత్తతో వ్యవహరించాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ఈ ఉదయం టెలీ కాన్ఫరెన్స్ లో ఏజెంట్లు, పార్టీ నేతలతో మాట్లాడిన ఆయన, ఇదే విషయాన్ని తాను ముందు నుంచే చెబుతున్నానని అన్నారు.
అయితే కౌంటింగ్ చివరి క్షణం వరకూ ఏజంట్లు కౌంటింగ్ కేంద్రంలోనే ఉండాలని, ఎటువంటి అలసత్వాన్ని ప్రదర్శించరాదని సూచించారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అరాచకాలకు పాల్పడినా టీడీపీ కార్యకర్తరు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ గెలుపును ఏ శక్తీ ఆపలేదని ధీమా వ్యక్తం చేశారు.








