31.2 C
Hyderabad
Thursday, November 5, 2026
- Advertisement -
Home ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2019 ఏపీలో తొలి ఫలితం వచ్చే నియోజకవర్గం ఇదే…

ఏపీలో తొలి ఫలితం వచ్చే నియోజకవర్గం ఇదే…

Difference Between Polling Votes 518 an evm votes 555 In Vikarabad
- Advertisement -

అమరావతి: నేడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇక ఈ ఫలితాల్లో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఫలితం మొదట విడుదలయ్యే అవకాశాలున్నాయి.  ఎందుకంటే నర్సాపురం పరిధిలో అతి తక్కువ పోలింగ్‌ కేంద్రాలున్నాయని, కేవలం 12 నుంచి 13 రౌండ్ల ఓట్ల లెక్కింపుతోనే తుది ఫలితం వస్తుంది.

అలాగే రాజమహేంద్రవరం రూరల్, రంపచోడవరం నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపునకు 36 నుంచి 37 రౌండ్ల పాటు ఓట్లను లెక్కించాల్సి వస్తుందని, ఈ నియోజకవర్గాల్లో ఫలితం వెలువడటానికి ఎక్కువ సమయం పడుతుంది. అయితే ఏ నియోజకవర్గం అయిన మొదట ఈవీఏంలు లెక్కింపు అయ్యాక…5 వీవీప్యాట్ స్లిప్స్ లెక్కిస్తారు. వీవీప్యాట్ స్లిప్స్ ఈవీఏంలతో సరిపోలేకే తుది ఫలితం వెల్లడిస్తారు.

ఇక 13 నుంచి 17 రౌండ్ల లెక్కింపుతో ఫలితం తేలే నియోజకవర్గాల్లో ఆచంట, కొవ్వూరు (ఎస్సీ), పాలకొల్లు, మచిలీపట్నం, ఏలూరు, బాపట్ల, నెల్లూరు సిటీ, తాడేపల్లిగూడెం, నిడదవోలు, పెడన, చీరాల, మండపేట, చిత్తూరు, ఉంగుటూరు, గుంటూరు ఈస్ట్, నెల్లూరు రూరల్, ప్రత్తిపాడు, అనపర్తి, నగరి, పార్వతీపురం, వేమూరు, మాడుగుల, విశాఖపట్నం సౌత్, విశాఖపట్నం వెస్ట్ నియోజకవర్గాలు ఉన్నాయి.

అలాగే 30 నుంచి 37 రౌండ్ల లెక్కింపు అవసరమయ్యే నియోజకవర్గాల్లో రాజమహేంద్రవరం రూరల్, రంపచోడవరం, జగ్గంపేట, అమలాపురం, పాణ్యం, రాజమహేంద్రవరం నగరం, తుని, పెద్దాపురం, గన్నవరం(ఎస్సీ), రాజానగరం, కాకినాడ నగరం నియోజకవర్గాలున్నాయి.

ఇక మిగతా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ 18 నుంచి 29 రౌండ్లలో కౌంటింగ్ పూర్తికానుంది.

చదవండి: ఏపీలో పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్క ఇదే..
- Advertisement -