
న్యూఢిల్లీ: భారత్ మరో ఘనత సాధించింది. దేశీయంగా అభివృద్ధి చేసిన హైపర్సోనిక్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ వెహికల్ (హెచ్ఎస్టీడీవీ)ను సోమవారం విజయవంతంగా పరీక్షించింది.
భవిష్యత్తులో దీర్ఘ శ్రేణి క్షిపణి వ్యవస్థలు, వైమానిక ప్లాట్‌ఫాంలకు ఈ పరీక్ష మరింత శక్తినివ్వనుంది.
హైపర్సోనిక్ ప్రొపల్షన్ సాంకేతికతల ఆధారంగా హెచ్ఎస్టీడీవీని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) దీనిని అభివృద్ధి చేసినట్టు అధికారులు తెలిపారు.
హెచ్ఎస్టీడీవీని విజయవంతంగా పరీక్షించడంపై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డీఆర్డీవోను అభినందించారు.
దీనిని ఓ మైలురాయిగా అభివర్ణించారు. ప్రధాని నరేంద్రమోదీ ఆత్మనిర్భర్ భారత్‌ను సాకారం చేసే క్రమంలో ఈ మైలురాయిని సాధించినందుకు డీఆర్డీవోను అభినందిస్తున్నట్టు పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న శాస్త్రవేత్తలతో మాట్లాడానని, ఈ గొప్ప విజయానికి అభినందించినట్టు చెప్పారు. వారిని చూసి దేశం గర్విస్తోందన్నారు.
హెచ్ఎస్టీడీవీ పరీక్ష విజయవంతంతో దేశీయ రక్షణ పరిశ్రమతో కలిసి తర్వాతి తరం హైపర్ సోనిక్ వెహికల్స్ నిర్మాణంలో ఉపయోగపడే అత్యంత సంక్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానం కోసం భారత్ తన సామర్థ్యాలను ప్రదర్శించిందని డీఆర్డీవో అధికారి ఒకరు తెలిపారు.
హెచ్ఎస్టీడీవీ క్రూయిజ్ క్షిపణులను శక్తిమంతం చేయడంతోపాటు స్క్రామ్‌జెట్ ఇంజిన్లపైనా పనిచేస్తుంది. ఇది మాక్ 6 వేగాన్ని అందుకోగలదు. రామ్‌జెట్స్ కంటే అత్యుత్తమమైనదని అధికారులు వివరించారు.
In a historic mission today, India successfully flight tested Hypersonic Technology Demonstrator Vehicle (HSTDV), a giant leap in indigenous defence technologies and significant milestone towards a #sashaktbharat and #atmanirbharbharat.
— DRDO (@DRDO_India) September 7, 2020








