25.2 C
Hyderabad
Saturday, September 19, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం లాక్‌డౌన్ కష్టాలు: రాజస్థాన్‌లో అవస్థలు పడుతున్న 200 మంది తెలుగు విద్యార్థులు!

లాక్‌డౌన్ కష్టాలు: రాజస్థాన్‌లో అవస్థలు పడుతున్న 200 మంది తెలుగు విద్యార్థులు!

telugu-students-facing-problems-in-rajastahan
- Advertisement -

జైపూర్: కరోనా వైరస్ విస్తరిస్తోన్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 200 మంది తెలుగు విద్యార్థులు రాజస్థాన్‌లో చిక్కుకుపోయారు. 

వీరంతా నీట్, ఐఐటీ కోచింగ్ కోసం కోటకు వెల్లిన వారు. అక్కడ వివిధ వసతి గృహాల్లో ఉండి శిక్ష్ణణ తీసుకుంటున్న వారు. మార్చిలో హఠాత్తుగా లాక్‌డౌన్ ప్రకటించడంతో వీరంతా ఇన్నిరోజులు అక్కడే చిక్కుకుపోయారు. 

చదవండి: లాక్‌డౌన్ కష్టాలు: తండ్రి చివరి చూపు కోసం.. ముంబై నుంచి జమ్మూకు సైకిల్‌పై బయల్దేరిన…

రాజస్థాన్‌లో కూడా కరోనా వైరస్ విజృంభిస్తోంది. లాక్‌డౌన్ కారణంగా అక్కడ హాస్టళ్లు కూడా మూసివేశారు.  దీంతో తినడానికి తమకు ఏమీ లభించడం లేదని, బిస్కెట్లు తిని బతుకుతున్నామంటూ విద్యార్థులు వాపోతున్నారు. 

తమ దుస్థితిని ఆవేదనతో వీడియో రూపంలో వివరిస్తూ.. ఆ వీడియోలను విద్యార్థులు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పంపించారు.

ఇప్పటికే కొన్ని రాష్ట్రాల అధికారులు వారి వారి విద్యార్థులను తీసుకెళ్లారని, తమను కూడా తీసుకెళ్లాలంటూ ఆ వీడియోలో వారు కోరారు.  

చదవండి: షాకింగ్: అమెరికాలో ప్రతి ఆరుగురిలో ఒకరి ఉద్యోగం ఊస్ట్! 90 ఏళ్ల తర్వాత మళ్లీ…
- Advertisement -