26.4 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం రసవత్తరంగా కన్నడ రాజకీయం: యడ్డీకి సిద్ధరామయ్య సవాల్…

రసవత్తరంగా కన్నడ రాజకీయం: యడ్డీకి సిద్ధరామయ్య సవాల్…

- Advertisement -

బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ తన ప్రయత్నాలని కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికే సంకీర్ణ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలని తమవైపు లాగాలని చూస్తున్న బీజేపీ….కర్నాటకలో అధికారం చేజిక్కించుకునేందుకు రోజుకో వ్యూహంతో ముందుకు వెళుతుంది.

ఈ క్రమంలోనే త్వరలో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడం  ఖాయమంటూ  రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఇక యడ్డీ వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిద్ధరామయ్య స్పందించారు.

యడ్యూరప్ప ప్రకటించినట్టుగా జూన్ 1లోగా ప్రభుత్వం పడిపోతే తన పదవికి రాజీనామా చేస్తానని సిద్ధరామయ్య ప్రకటించారు. ఒకవేళ అలా జరగని పక్షంలో యడ్యూరప్ప ఆయన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమా? అని సిద్ధరామయ్య సవాల్ విసిరారు.

అలాగే కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వానికి ఎలాంటి ముప్పూ లేదని,  తమ ప్రభుత్వం ఐదేళ్లూ పూర్తిగా పరిపాలిస్తుందని, ఇందులో ఎటువంటి అనుమానం లేదని చెప్పారు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ తమతోనే ఉన్నారని, ఎవరూ పార్టీని వీడబోరని స్పష్టం చేశారు. రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చేసే అధికారం బీజేపీకి ఎవరిచ్చారని, ఆ అధికారం రాజ్యాంగంలోని ఏ పేజీలో ఉందని ప్రశ్నించారు.

చదవండి: మాజీ ప్రధాని అయినంత మాత్రాన ఓడిపోకూడదనే రూల్ లేదు: దేవెగౌడ
- Advertisement -