
- Advertisement -
అమరావతి: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడంతో చాలా సంతోషంగా ఉందని కర్ణాటక బీజేపీ నేత, మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి చెప్పారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మరోమారు ఘన విజయాన్ని అందుకుంది.
ఇక వరుసగా రెండోసారి బీజేపీ అధికారంలోకి రావడంతో సోమవారం ఆయన కర్నూలు జిల్లాలోని మంత్రాలయం చేరుకుని రాఘవేంద్రస్వామికి మొక్కులు సమర్పించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆ తరువాత గాలి జనార్దన్ మాట్లాడుతూ ఏపీ సీఎంగా జగన్ తన తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. అద్భుత పాలనతో చరిత్రలో గొప్ప సీఎంగా నిలిచిపోవాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి రావడంతో రాఘవేంద్రస్వామికి మొక్కులు సమర్పించుకున్నట్టు తెలిపారు.
చదవండి: శ్రీకాకుళం, గుంటూరు లోక్‌సభ ఫలితాలపై కోర్టుకు వెళ్లనున్న వైసీపీ…
- Advertisement -








