22.8 C
Hyderabad
Saturday, November 7, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం సూరత్‌ కోచింగ్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం: 20కి పెరిగిన మృతుల సంఖ్య..

సూరత్‌ కోచింగ్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం: 20కి పెరిగిన మృతుల సంఖ్య..

- Advertisement -

సూరత్:  గుజరాత్ రాష్ట్రం సూరత్‌లోని సర్తానా ప్రాంతంలోని ఓ కోచింగ్ సెంటర్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.  ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందగా, చాలా మందికి గాయాలయ్యాయి. అయితే కోచింగ్ సెంటర్ రెండో అంతస్తులో ఉండటం వలన విద్యార్ధులు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు ఆ బిల్డింగ్ పై నుంచి కిందకు దూకడంతో తీవ్ర గాయాల పాలయ్యారు.
తాజా సమాచారం ప్రకారం ఈ అగ్ని ప్రమాదంలో మొత్తం 20 విద్యార్ధులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.

ఇక ఈ ఘటనపై గుజరాత్ సీఎంవో స్పందించింది. ఘటనపై సీఎం విజయ్ రూపానీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని సీఎంవో తెలిపింది. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ.. వారికి రూ.4 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తుట్లు ఆదేశించారని తెలిపింది.

చదవండి: సౌదీలో నరకం చూస్తున్న మరో తెలంగాణ యువకుడు! కాపాడాలని కేటీఆర్‌కి వినతి…
- Advertisement -