
హైదరాబాద్: ఇటీవల తెలంగాణలో మూడో దశల్లో 5,817 ఎంపీటీసీలకు, 538 జెడ్పీటీసీలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం అయితే సోమవారం ఎన్నికల ఫలితాలను ప్రకటించాల్సి ఉంది.
కానీ తాజాగా ఆ ఎన్నికల ఫలితాలని వాయిదా వేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఫలితాల తేదీలను త్వరలో ప్రకటిస్తామని ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఓట్ల లెక్కింపును వాయిదా వేయాలని పలు పార్టీలు ఎన్నిలక సంఘాన్ని కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
షెడ్యూల్ ప్రకారం అయితే ఫలితాలు వెల్లడించిన తరువాత ఎంపీపీ, జెడ్పీ ఛైర్మన్ల ఎన్నికకు 40రోజులకు పైగా సమయం పడుతుంది. ఆ సమయంలో ఒక పార్టీ నుండి గెలిచిన అభ్యర్థులను మరో పార్టీ కొనుగోలు చేసే ప్రమాదం ఉందంటూ పలు పార్టీలు ఎన్నిలక సంఘానికి ఫిర్యాదు చేశాయి.
విపక్షాల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ కౌంటింగ్‌ను వాయిదావేస్తూ నిర్ణయం తీసుకుంది. ఫలితాలు వెల్లడించే తేదీని త్వరలో ప్రకటిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది.








