వర్మ వదలడుగా: మే 31న ఏపీలో విడుదల కానున్న‘లక్ష్మీస్ ఎన్టీఆర్’…

ap-high-court-stall-the-film-lakshmis-ntr-release
- Advertisement -

హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాని ఆంధ్రప్రదేశ్‌లో విడుదల చేసే వరకు నిద్రపోయేలా లేడు. ఇటీవల ఎన్నికల కోడ్ ఉండటంతో సినిమా ఏపీలో విడుదల చేయడానికి కుదరలేదు. అయితే అప్పుడు ఉన్న టీడీపీ ప్రభుత్వమే సినిమాని అడ్డుకుందని వర్మ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు.

చదవండి: పవన్ ఓటమిపై స్పందించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్…

ఈ క్రమంలోనే ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతున్న నేపథ్యంలో జగన్ ఈ నెల 30న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారు. ఇక ఆ మరుసటి రోజే రామ్ గోపాల్ వర్మ తన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు వర్మ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

అయితే ఇటీవల ఎన్నికల జరుగుతున్న సమయంలో వర్మ విజయవాడ పైపుల రోడ్డులో ప్రెస్ మీట్ పెట్టాలని ప్రయత్నించగా, పోలీసులు అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తిప్పి పంపారు. కానీ ఇప్పుడు ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో మరోసారి ప్రెస్ మీట్ పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.

‘‘ఎక్కడైతే నన్ను మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్ చేయించారో అదే విజయవాడలో.. అదే పైపుల రోడ్డులో ప్రెస్ మీట్ పెడుతున్నా… బస్తీ మే సవాల్” అంటూ ట్వీట్ చేసిన వర్మ.. నిజమైన ఎన్టీఆర్ అభిమానులకు ఇది తన బహిరంగ ఆహ్వానం అని పేర్కొంటూ చివర్లో జై జగన్ నినాదంతో ట్వీట్‌ను ముగించారు.

చదవండి: వైఎస్ జగన్‌కి శుభాకాంక్షలు తెలిపిన సూపర్ స్టార్…


 

- Advertisement -