
హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ పార్టీ ఖచ్చితంగా రెండు ఎంపీ సీట్లు గెలవబోతుందని ఆ పార్టీ సీనియర్ నేత, కర్నాటక మాజీ సీఎం యడ్యూరప్ప జోస్యం చెప్పారు. నిన్న వికారాబాద్ జిల్లా తాండూరులో పర్యటించిన యడ్యూరప్ప..భావిగి భద్రేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణలో సికింద్రాబాద్, మహబూబ్ నగర్ లోక్‌సభ సీట్లను బీజేపీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే కేంద్రంలో మరోసారి బీజేపీ జెండా ఎగురుతుందని చెప్పారు.
చదవండి: కేసీఆర్ గజకర్ణ, గోకర్ణ విద్యలు తమిళనాడులో పనిచేయలేదు: విజయశాంతి
ఇక బీజేపీ 280 సీట్లు సాధించి మోదీ మరోసారి ప్రధాని కాబోతున్నారని అన్నారు. అలాగే కర్నాటకలో మొత్తం 28 సీట్లుకి గాను బీజేపీకి 20-22 ఎంపీ సీట్లు వస్తాయని వెల్లడించారు. కర్నాటకలో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంపై కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోతుందని, 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై అసంతృప్తి ఉన్నారని, అయితే అందులో తమ ప్రమేయం ఏమీ ఉండదని స్పష్టంచేశారు.
చదవండి: హిందూ ఉగ్రవాది వ్యాఖ్యలు: కమల్‌పై 3 కేసులు నమోదు








