23.3 C
Hyderabad
Thursday, November 5, 2026
- Advertisement -
Home వార్తలు తెలంగాణ ఒకేసారి 177 పిటిషన్లను విచారిస్తూ చరిత్ర సృష్టించనున్న తెలంగాణ హైకోర్టు…

ఒకేసారి 177 పిటిషన్లను విచారిస్తూ చరిత్ర సృష్టించనున్న తెలంగాణ హైకోర్టు…

- Advertisement -

హైదరాబాద్:  తెలంగాణ హైకోర్టు చరిత్రలోనే ఈరోజు అరుదైన సంఘటన చోటు చేసుకోనుంది. ఒకేసారి 177 పిటిషన్లను విచారిస్తూ… చరిత్ర సృష్టించబోనుంది.

అసలు విషయం ఏమిటంటే… తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుపై చాలామంది హైకోర్టులో పిటిషన్లు వేశారు. కాళేశ్వరానికి వ్యతిరేకంగా మోతమ్ 177 పిటిషన్లు దాఖలు అయ్యాయి.

చదవండి: మోడీకి.. ‘మహర్షి’ సినిమాకి లింక్ పెట్టిన కుటుంబరావు…
ఈ క్రమంలోనే నేడు  హైకోర్టు వాటన్నింటినీ ఒకేసారి విచారించాలని నిర్ణయించింది. ఇక వీటిల్లో రైతులు, రైతు కూలీలు, ఇతరులకు పునరావాసం కల్పించే వరకూ ప్రాజెక్టు పనులను చేపట్టవద్దని దాఖలైన పిటిషన్లే ఎక్కువగా ఉన్నాయి.

ఇదిలా ఉంటే కాళేశ్వరం ముంపు పరిధిలోని కిష్టాపూర్‌లో పనులు చేయరాదని గతంలో సింగిల్ జడ్జి తీర్పు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కిష్టాపూర్ పై సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం అపీల్ చేయగా, దానిపైనా నేడు విచారణ జరగనుంది.

చదవండి రవిప్రకాశ్ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు.. ఇక అరెస్టు అనివార్యం!?
- Advertisement -