22.7 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home వార్తలు తెలంగాణ ఇంటర్ ఇష్యూ: హైకోర్టులో విచారణ, 27న రీ వాల్యుయేషన్ రిజల్ట్స్ విడుదలకు ఆదేశం…

ఇంటర్ ఇష్యూ: హైకోర్టులో విచారణ, 27న రీ వాల్యుయేషన్ రిజల్ట్స్ విడుదలకు ఆదేశం…

Telangana Latest Updates, Inter result news, Telangana Inter Board News, Newsxpressonline
- Advertisement -

హైదరాబాద్: ఇంటర్ వివాదంపై ఈ రోజు హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఈ నెల 27వ తేదీన ఫలితాలను విడుదల చేయాలని తెలంగాణ ఇంటర్ బోర్డును ఆదేశించింది. ముందుగా, ఫెయిల్ అయిన విద్యార్థుల జవాబు పత్రాల రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ పూర్తయ్యిందని అధికారులు కోర్టుకు తెలిపారు.

రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ పూర్తయ్యినందున రేపు ఫలితాలను ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. అయితే, ఈ నెల 27వ తేదీనే ఫలితాలతో పాటు జవాబు పత్రాలను ఒకేసారి వెబ్‌సైట్‌లో ఉంచాలని కోర్టు స్పష్టం చేసింది. మరోవైపు, ఈ కేసులో గ్లోబరీనా సంస్థకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 6వ తేదీకి వాయిదా వేసింది.

కాగా, ఈ రోజు కోర్టు విచారణ అనంతరం ఫలితాలను మధ్యాహ్నం వరకు ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చినా.. కోర్టు తాజా ఆదేశంతో ఫలితాల వెల్లడి వాయిదా పడింది. మరోవైపు, ఇంటర్ బోర్డు నుంచి గ్లోబరీనా సంస్థను తొలగించిన సంగతి తెలిసిందే.

2018-19 నుంచి మూడేళ్ల పాటు పరీక్ష ఫలితాల నిర్వహణ బాధ్యతల టెండరును గ్లోబరీనా దక్కించుకున్నా.. తొలి ఏడాదే పరీక్ష నిర్వహణలో ఆ సంస్థ పూర్తిగా విఫలమైంది.

- Advertisement -