25.2 C
Hyderabad
Saturday, September 19, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ వైసీపీ అధికారంలోకి వస్తే ఆయనకి కేబినెట్‌లో బెర్త్‌ ఖాయమా..!?

వైసీపీ అధికారంలోకి వస్తే ఆయనకి కేబినెట్‌లో బెర్త్‌ ఖాయమా..!?

YS Jagan Updates News, AP Cabinet Latest News, YCP News, Newsxpressonline
- Advertisement -

అమరావతి: ఆయ‌న‌కు వైఎస్ ఫ్యామిలీ అంటే ప్రాణం. రాజ‌కీయంగా త‌న‌కు గుర్తింపు ఇచ్చిన వైఎస్ అంటే అపార‌మైన ప్రేమ‌, అంత‌కు మించిన గౌర‌వం.

ఒకే ఫ్యామిలీలో ఇద్ద‌రికి టికెట్లా? అంటూ పార్టీలోని సీనియ‌ర్లు పెద‌వి విరిచిన స‌మ‌యంలో నేనున్నానంటూ వైఎస్ క‌లుగ‌జేసుకుని త‌న‌కు టికెట్ ఇప్పించ‌డ‌మే కాకుండా రెండు సార్లు ప్ర‌చారం చేసి మ‌రీ త‌న గెలుపున‌కు కార‌ణ‌మ‌య్యార‌నే విశ్వాసం ఆయ‌న‌లో ఇప్ప‌టికీ తొంగి చూస్తోంది.

చదవండి: చంద్రబాబుకి బిగ్ షాక్! బీజేపీయేతర పక్షాల భేటీకి కేసీఆర్, జగన్‌కి ఆహ్వానం!

అందుకే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మ‌ర‌ణానంతరం ఆయన ఆ కుటుంబానికి అండ‌గా నిలిచారు. ఎవ‌రు ఏమ‌న్నా.. ఏ ప‌రిస్థితి ఎలా వ‌చ్చినా తాను లెక్క చేయ‌బోన‌ని చెప్పారు. ఆయ‌నే శ్రీకాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస‌గా మూడు సార్లు విజ‌యం సాధించిన ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌.

రెవెన్యూ మంత్రిగా చ‌క్రం తిప్పిన ధ‌ర్మాన ప్ర‌సాద‌రావుకు అన్న‌గా కంటే కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుచ‌రుడిగానే కృష్ణ‌దాస్ చెప్పుకొంటారు.  రాజ‌కీయంగా త‌న‌కు గుర్తింపు ల‌భించడానికి వైఎస్ కార‌ణ‌మ‌ని ఆయ‌న ఇప్ప‌టికీ విశ్వాసం ప్ర‌ద‌ర్శిస్తారు.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న వైఎస్ మ‌ర‌ణానంత‌రం, వైఎస్ జ‌గ‌న్ స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు. అంతేకాదు, అసలు కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి సొంత పార్టీ పెట్టాల‌ని వైఎస్ జగన్‌కు చెప్పిన వారిలో ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌ కూడా ఉన్నార‌ని వైసీపీ నాయ‌కులు చెప్పుకొంటారు.

శ్రీకాకుళం నుంచి గెలిచి, మంత్రి వ‌ర్గంలో ఉన్న ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు వారిస్తున్నా కూడా లెక్క‌చేయ‌కుండా త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన కృష్ణ‌దాస్‌.. ఆ వెంట‌నే వైసీపీలో చేరిపోయారు. ఆ తరువాత జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో అదే పార్టీ టికెట్‌పై ఆయన విజ‌యం కూడా సాధించారు.

చదవండి: ఫలితాల ముందు బాబుకి మరో షాక్! కాంగ్రెస్‌లో చేరనున్న మాజీ మంత్రి!

పార్టీలో విధేయుడుగా, ముఖ్యంగా వైఎస్ ఫ్యామిలీకి అత్యంత విశ్వాస పాత్రుడిగా మెలిగారు. 2014లో ఆయ‌న ఓడిపోయినా పార్టీని అభివృద్ది చేసేందుకు అనుక్ష‌ణం కృషి చేశారు. జ‌గ‌న్ పాద‌యాత్ర‌ను అన్నీ తానై న‌డిపించారు.

ఈ క్ర‌మంలోనే ఈ నెల 23 నాటి ఫ‌లితాల అనంత‌రం వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్ప‌డితే.. ధర్మాన కృష్ణ‌దాస్‌కు కీల‌క‌మైన ప‌ద‌వి ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని లోట‌స్ పాండ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

కృష్ణ‌దాస్ వివాద‌ర‌హితుడు, ఇంకా చెప్పాలంటే ధ‌ర్మాన‌ ప్రసాదరావు కంటే కూడా కృష్ణ‌దాస్‌కు మంత్రి ప‌ద‌వి ఇచ్చేందుకే అటు జ‌గ‌న్ కూడా సుముఖంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి 23న విడుదలయ్యే ఎన్నికల ఫలితాల త‌ర్వాత ఏం జ‌రుగుతుందో చూడాలి.

 
- Advertisement -