
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి కేసు విషయంలో ఊహించని విషయాలు బయటకొస్తున్నాయి. అతను చేసిన అఘాయిత్యాలపై విచారణ జరుపుతున్న పోలీసులకి సైకో కిల్లర్ షాకింగ్ విషయాలు చెబుతున్నాడు.
ఎందుకు ఈ దారుణాలకు పాల్పడ్డావని అతన్ని పోలీసులు అడిగితే.. ‘ఆ సమయంలో అలా అనిపించింది.. అందుకే చంపేశా’ అని సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. అయితే శ్రీనివాస్‌రెడ్డిలో సైకో లక్షణాలు లేవని పోలీసులు చెప్పడం గమనార్హం.
చదవండి: హాజీపూర్ హత్యాచారాలు: సైకో శ్రీనివాస్ రెడ్డికి.. మరికొందరి సహకారం!?
పైగా అతడు గంజాయి, డ్రగ్స్‌కు బానిస కాదని, బీరు మాత్రమే తాగుతాడని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఇక విచారణకు బాగానే సహకరించాడని, అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పాడని వెల్లడించాయి.
కాగా, యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మలరామారం హాజీపూర్‌లో శ్రీనివాస్ రెడ్డి..ముగ్గురు బాలికలను కిడ్నాప్ చేసి, అతి కిరాతకంగా అత్యాచారం చేసి చంపేసి, పాడుబడిన బావిలో పాతిపెట్టిన విషయం తెలిసిందే.
అయితే గత నెల 25న పదోతరగతి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన కేసులోనే శ్రీనివాస్‌రెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇక ఆ తర్వాతే మిగతా హత్యల గురించి బయటకొచ్చింది.








