
బెంగళూరు: సార్వత్రిక ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్న బీజేపీ-కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ….ఎన్నికలని హీట్ ఎక్కిస్తున్నారు.
కొందరు నేతలు అయితే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ…ఎన్నికల సంఘం ఆగ్రహానికి గురవుతున్నారు కూడా.. ఈ క్రమంలోనే తాజాగా ప్రధాని మోడీపై కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు.
చదవండి: మీది 56 అంగుళాల ఛాతీీ.. మిమ్మల్ని నేనెలా కొట్టగలను?: మోడీపై మమత సెటైర్లు…
ఎన్నికల ప్రచారంలో మోడీ సొంతడబ్బా కొట్టుకుంటున్నారని, ఎదుట పార్టీ మీద విమర్శలు చేసే ముందు….తొలుత మోడీ తన పార్టీ బీజేపీ గురించి మాట్లాడాలని చెప్పారు. ఇక మోడీ ఎక్కడికి వెళ్లినా కాంగ్రెస్‌కు 40 సీట్లకు మించి రావని అంటున్నారని, అంతకుమించి సీట్లు వస్తే ఢిల్లీలోని విజయ్ చౌక్‌లోఆయన ఉరేసుకుంటారా? అని ప్రశ్నించారు.
ఇక తమ హయాంలో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టామని, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీకి ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా ఆమె త్యాగం చేశారని, దేశానికి ఓ ఆర్థికవేత్త ప్రధాని కావాలని అనుకున్నారని ఖర్గే తెలిపారు.








