26.1 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ ‘వకీల్ సాబ్‌’గా పవన్ ఇరగదీశాడట.. 4 స్టార్ రేటింగ్ ఇచ్చేశారు!

‘వకీల్ సాబ్‌’గా పవన్ ఇరగదీశాడట.. 4 స్టార్ రేటింగ్ ఇచ్చేశారు!

- Advertisement -

హైదరాబాద్: పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ దాదాపు 3 సంవత్సరాల తర్వాత నటించిన చిత్రం ‘వకీల్‌సాబ్’. దీంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. అంచనాలకు తగ్గట్టే ఇప్పటి వరకు విడుదలైన పాటలు, టీజర్‌, ట్రైలర్‌ ప్రేక్షకులను మైమరపించాయి. సినిమాపై క్రేజ్‌ను ఒక్కసారిగా పెంచేశాయి. ట్రైలర్‌ అయితే టాలీవుడ్‌ రికార్డులను తిరగరాసింది.

తాజాగా, ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. అఫీషియల్‌ యూట్యూబ్‌లో దీనిని తిలకించిన వారి విషయంలో కూడా ‘వకీల్‌ సాబ్‌’ రికార్డును క్రియేట్‌ చేశాడు. దాదాపు 1.3 లక్షల మంది ఈ వేడుకను దిల్‌ రాజు యూట్యూబ్‌ చానల్‌ ద్వారా తిలకించినట్టు చిత్ర యూనిట్‌ ప్రకటించింది.

ఎల్లుండి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. ఓవర్సీస్‌ సెన్సార్‌ సభ్యుడినని చెప్పుకునే వివాదాస్పద సౌత్ ఇండియన్ ఫిల్మ్ క్రిటిక్‌ ఉమైర్‌ సంధు ఈ చిత్రాన్ని చూసినట్లుగా తాజాగా ట్వీట్ చేశాడు. ఫస్ట్ రివ్యూ అంటూ సినిమా ‘టెర్రిఫిక్‌’ అని నాలుగు స్టార్స్‌ రేటింగ్ ఇచ్చేశాడు. ఇప్పుడు ఈ ట్వీట్లు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.

నిజానికి సినిమా విడుదలకు ముందు ఉమర్‌ సంధు ఫోర్‌స్టార్స్ ఇచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడ్డాయి. ఒకటీ అరా సినిమాలు మాత్రం ఆడాయి. ఇప్పుడు వకీల్‌ సాబ్‌ చూశానంటూ ఫస్ట్ రివ్యూ అంటూ ట్విట్టర్‌లో తెగ హడావుడి చేస్తున్నాడు. ఇలాంటి రివ్యూలు ఇస్తున్నాడనే ఒకసారి ఆయన ట్విట్టర్‌ అకౌంట్‌ని బ్లాక్‌ చేయించారు కూడా. దీంతో కొత్త అకౌంట్‌తో మళ్లీ అభిమానుల ముందుకు వచ్చేశాడు.

సంధు చెబుతున్న ప్రకారం వకీల్‌సాబ్ సినిమా ఫస్ట్‌ హాఫ్‌ కొంత స్లోగా ఉంది. గ్రిప్పింగ్‌ స్క్రీన్‌ప్లేతో దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించాడని, పవన్‌ కల్యాణ్‌ తన కెరియర్‌లోనే అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడని పేర్కొన్నాడు.

అద్బుతమైన విజువల్స్‌తో, కొన్ని స్పీచ్‌ లెస్‌ సీన్లతో సినిమా ఉందని, పవన్‌ కల్యాణ్‌ ఈ చిత్రం ద్వారా ఓ పవర్‌ ఫుల్‌ మెసేజ్‌ని ఇవ్వబోతున్నాడని చెబుతూ నాలుగు స్టార్లు ఇచ్చేశాడు. సంధు ఫోర్ స్టార్ రేటింగ్ ఎంత నిజమో తెలియాలంటే మరో రెండు రోజులు వెయిట్ చెయ్యక తప్పదు మరి!

- Advertisement -