23.7 C
Hyderabad
Friday, November 27, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’: నిజాలు దాస్తే దాగవు, 23 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిన వర్మ!

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’: నిజాలు దాస్తే దాగవు, 23 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిన వర్మ!

Lakshmi's NTR Latest News, Tollywood Movie Latest News, Newsxpressonline
- Advertisement -

హైదరాబాద్: అదేదో సినిమాలో ఓ క్యారక్టర్ అంటుంది.. ‘చెరిపేస్తే చెరిగిపోవడానికి చిత్తు కాగితం కాదు ఇది.. చరిత్ర..’ అని. అనంత కాల గమనంలో మానవుని జీవనం చాలా చిన్నది. అయితే కాలానికి మాత్రం ప్రతి మలుపు గుర్తుంటుంది. ప్రతి పిలుపు గుర్తుంటుంది. ఒకనాటి కాలంలో జరిగినది మరో కాలంలో వెలుగులోకి తప్పక వస్తుంది.

అదే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’.. మూవీ ద్వారా మరో మారు తెలిసింది. ఆనాడు నిజమైన అన్న గారి అభిమానులు పడిన వేదన, రోదన అంతా ఇంతా కాదు. తాము ఎంతో అభిమానించే నందమూరి తారక రామారావుకి సొంత కుటుంబీకులే ద్రోహం చేశారని తెలుసుకున్న తెలుగు ప్రజానీకం షాక్ తిన్న సందర్భమది.

నాటి ఘటనలను కళ్ళకు కట్టినట్లుగా తీసిన ఘనత అచ్చంగా రామ్ గోపాల్ వర్మకే దక్కుతుంది. జీవితాన్ని అలా చూపించి కాలాన్ని ఒక్కసారిగా ఇరవై మూడేళ్ళ వెనక్కి తీసుకెళ్ళిపోయాడు. నందమూరి నట్టింట జరిగిన వెన్నుపోటుని పూసగుచ్చినట్లుగా సెల్యూలాయిడ్ మీదకు ఎక్కించి చూపించాడు.

అన్న గారికి జరిగినది మళ్ళీ ఎవరికీ జరగకూడదన్నది ఈ మూవీ చూసిన నేటి తరం కూడా అనుకునేలా ఉందని అంటున్నారు. ముఖ్యంగా వెన్నుపోటు ఎపిసోడ్ హైలెట్ అంటున్నారు. నందమూరి తారక రామారావు నిర్భయంగా బతికారు. తన కోసం అండగా ఉన్న లక్ష్మీ పార్వతిని నలుగురిలో ధైర్యంగా వివాహం చేసుకున్న మేటిగా ఆయన నిలిచారు.

చివరి దశలో ఆయన పడిన కష్టాలు, దైన్యం అన్న గారి అభిమానులకు కంట తడి తెప్పించేవే. మొత్తానికి కాలమనే కాగితం మీద రామ్ గోపాల వర్మ గతం గుర్తులను మరో మారు ఆవిష్కరించిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’.

సంబంధిత వార్తలు

దూసుకెళ్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్.. వర్మ ఫుల్ హ్యాపీ
లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫస్ట్ డే కలెక్షన్స్ .. ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ రివ్యూ!
లక్ష్మీస్ ఎన్టీఆర్ …ప్లస్ లు , మైనస్ లు
బ్రేకింగ్: వర్మకు షాక్! ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదలను ఆపేసిన హైకోర్టు!!
 
- Advertisement -