22.1 C
Hyderabad
Saturday, November 28, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ అయోమయంలో బోయపాటి! సినిమా సెట్స్ పైకి ఎప్పుడో!

అయోమయంలో బోయపాటి! సినిమా సెట్స్ పైకి ఎప్పుడో!

boyapatisrinu
- Advertisement -

హైదరాబాద్: బోయపాటి శ్రీను ఈ పేరుకే టాలీవుడ్ లో ఒక చరిత్ర ఉంది. తెలుగు సినీ చిత్ర పరిశ్రమలోని టాప్ డైరెక్టర్స్ లో బోయపాటి ముందువరుసలో ఉంటాడు. ఈ ఏడాది ఆరంభంలోనే బోయపాటి ‘వినయ విధేయరామ’తో భారీ పరాజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా ఆయనకి ఎన్నో విమర్శలను కూడా తెచ్చిపెట్టింది.

బోయపాటి ఆలోచనలోపడ్డాడ…

ఆ తరువాత బాలకృష్ణతో చేయనున్న సినిమాతో ఆ విమర్శలకి ఫుల్ స్టాప్ పెట్టేయాలని బోయపాటి నిర్ణయించుకున్నాడు. సాధ్యమైనంత త్వరగా బాలకృష్ణతో సెట్స్ పైకి వెళ్లిపోవాలని భావించాడు. అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కారణంగా జూన్ తరువాత ఈ ప్రాజెక్టుపై దృష్టి పెడతానని బాలకృష్ణ అనడంతో బోయపాటి నిరాశకి లోనయ్యాడు.

ఇక ఇటీవల బాలకృష్ణ సొంత బ్యానర్లో వచ్చిన ‘కథానాయకుడు’ , ‘మహానాయకుడు’ సినిమాలు ఆయనకి భారీ నష్టాలను తెచ్చిపెట్టాయి. దాంతో ఇకపై సినిమాల నిర్మాణాన్ని కొనసాగించాలా వద్దా? అనే విషయాన్ని గురించి కూడా ఆయన ఆలోచిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

ఈ విషయం బోయపాటిని మరింత టెన్షన్ పెడుతోందట. అప్పటికప్పుడు వేరే నిర్మాతను సెట్ చేసుకోవడం కూడా అంత తేలికైన విషయం కాకపోవడంతో బోయపాటి అయోమయంలో పడ్డాడు. ఈ ఏడాది బోయపాటి నుంచి మరో సినిమా వస్తుందా లేదో చూడాలి మరి.

చదవండి: వినయ విధేయ రామ అమేజాన్ ప్రైమ్ డేట్ ఫిక్స్ ! ఎప్పుడో తెలుసా!

- Advertisement -