24.2 C
Hyderabad
Tuesday, October 13, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ మరో కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కల్యాణ్ రామ్!

మరో కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కల్యాణ్ రామ్!

Nandamuri-Kalyan-Ram
- Advertisement -

హైదరాబాద్: నందమూరి హీరో కల్యాణ్ రామ్ కథానాయకుడిగా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘118’కి పూర్తి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చి రెండు రోజులు గడవకముందే తన తదుపరి సినిమా కోసం ఓ యువ దర్శకుడికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.

ప్రయోగాలు ఆపని కళ్యాణ్ రామ్..

ఆ దర్శకుడు ఎవరోకాదు ‘ఉయ్యాలా జంపాలా’ , ‘మజ్ను’ చిత్రాల దర్శకుడు విరించి వర్మ. ఈ రెండు సినిమాలు కూడా యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాయి.ఇటీవలే ఈ దర్శకుడు కల్యాణ్ రామ్ కి ఒక కథ వినిపించాడట. కథలోని కొత్తదనం కారణంగా విరించి వర్మకి ఓకే చెప్పేశాడని సమాచారం.

ప్రస్తుతం విరించి వర్మ ఈ స్క్రిప్ట్ పైనే కసరత్తు చేస్తున్నాడని అంటున్నారు. పల్లెటూరి నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని చెబుతున్నారు. ఇంతవరకూ చేయని పాత్రలో కల్యాణ్ రామ్ కనిపించనున్నాడని అంటున్నారు. మే నెలలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తుంది.

చదవండి: నితిన్ కొత్త చిత్రం షూటింగ్ ముహూర్తం ఫిక్స్!

- Advertisement -