29.5 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం అభినందన్ కోసం విమానం పంపుతామన్న భారత్: పాక్ నిరాకరణ

అభినందన్ కోసం విమానం పంపుతామన్న భారత్: పాక్ నిరాకరణ

Abhinandan-Varthaman
- Advertisement -

Abhinandan-Varthaman
న్యూఢిల్లీ: పాకిస్థాన్‌ కస్టడీలో ఉన్న భారత వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ను తీసుకొచ్చేందుకు ప్రత్యేక విమానాన్ని పంపించేందుకు భారత్‌ ప్రయత్నించినట్లు సమాచారం. అయితే, అందుకు పాక్‌ నిరాకరించిందని ఎన్డీటీవీ తన కథనంలో పేర్కొంది.

పాక్‌ నుంచి ప్రత్యేక విమానంలో నేరుగా ఢిల్లీకి తీసుకొచ్చి ఆయనకు వెంటనే వైద్య చికిత్స అందించాలని భారత్‌ భావించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఐఏఎఫ్‌కు చెందిన విమానాన్ని పంపిస్తామని అందులో అభినందన్‌ను పంపించాల్సిందిగా పాక్‌ను కోరింది. కానీ, ఇందుకు పాక్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. రోడ్డు మార్గం ద్వారానే వాఘా సరిహద్దు వద్ద అభినందన్‌ను అప్పగిస్తామని స్పష్టం చేసింది.

అభినందన్‌కు ఘన స్వాగతం పలికేందుకు…

ఇది ఇలా ఉండగా, అభినందన్‌ను ఆహ్వానించేందుకు వాఘా సరిహద్దు వద్ద భారీగా ప్రజలు చేరుకున్నారు. ఇప్పటికే అభినందన్ కుటుంబసభ్యులు వాఘా సరిహద్దుకు చేరుకున్నారు. అభినందన్‌కు ఘన స్వాగతం పలికేందుకు ఐఏఎఫ్ బృందం, రక్షణదళాలు ఎదురుచూస్తున్నాయి.

కాగా, పాక్‌లోని భారత్‌ హైకమిషన్‌ కార్యాలయం ఇప్పటికే అభినందన్‌ అప్పగింతకు సంబంధించిన పత్రాలను పూర్తి చేసి వారికి అప్పగించినట్లు తెలుస్తోంది. శుక్రవారం సాయంత్ర 4గంటల వరకు అభినందన్‌ వాఘా సరిహద్దుకు చేరుకునే అవకాశం ఉంది. పాక్‌ అదుపులో ఉన్న అభినందన్‌ను అప్పగిస్తామని ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ గురువారం పార్లమెంటులో ప్రకటించిన విషయం తెలిసిందే.

చదవండి: అభినందన్ తల్లిదండ్రులకు ఢిల్లీలో ఘనస్వాగతం: వాఘాకు ప్రయాణం

- Advertisement -