29.2 C
Hyderabad
Friday, November 6, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం బంపరాఫర్: 100జీబీ అదనపు డేటా ప్లస్ అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ ఉచితం!

బంపరాఫర్: 100జీబీ అదనపు డేటా ప్లస్ అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ ఉచితం!

act-fibernet-with-amazon-fire-tv-stick, newsxpress.online
- Advertisement -

act-fibernet-amazon-fire-tv-stick-offer, newsxpress.online

న్యూఢిల్లీ: బెంగళూరుకు చెందిన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ యాక్ట్ ఫైబర్ నెట్ తన వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. అదనంగా 100 జీబీ ఉచిత డేటాను అందించనుంది. ఈ కొత్త ఆఫర్ ఈ సంస్థ తన సేవలు అందిస్తోన్న 16 నగరాలలో.. అదీ ఎంపిక చేసిన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లలో మాత్రమే అందుబాటులో ఉంటుందని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

యాక్ట్ ఫైబర్ నెట్ వినియోగదారులు ఈ అదనపు ఉచిత డేటాను తమ స్మార్ట్‌ఫోన్‌లో యాక్ట్ ఫైబర్ నెట్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని చూడవచ్చు. ఈ ఆఫర్ ఈ నెల 28 వరకు చెల్లుబాటులో ఉంటుంది.

బెంగళూరు మరియు చెన్నై నగరాల్లో యాక్ట్ ఫైబర్ నెట్ వినియోగదారులకు ఈ ఉచిత 100 జీబీ డేటాతోపాటు అదనంగా మరో 300జీబీ డేటాను కూడా ఇవ్వనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.

అంతేకాదు, ఈ అదనపు డేటాతోపాటు ఎంపిక చేసిన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లతో రూ.3,999 విలువైన అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ విత్ అలెక్సా వాయిస్ రిమోట్‌ను కూడా ఉచితంగా అందించనున్నట్లు పేర్కొంది.

12 నెలల సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోవడం ద్వారా…

అయితే ఈ ఆఫర్ ప్రస్తుతం బెంగళూరు, చెన్నై, ఢిల్లీ మరియు హైదరాబాద్ నగరాల్లో యాక్ట్ ఫైబర్ నెట్ ఉపయోగిస్తున్న వారికి మాత్రమే వర్తిస్తుంది. ఒకేసారి 12 నెలల సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోవడం ద్వారా ఈ ఆఫర్‌ను పొందవచ్చు.

బెంగళూరులో అదనపు ఉచిత డేటాతోపాటుగా అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ విత్ అలెక్సా వాయిస్ రిమోట్ ఉచితంగా పొందాలనుకున్న వినియోగదారులు యాక్ట్ స్టార్మ్ (నెలకు రూ.1,049), యాక్ట్ లైట్నింగ్ (నెలకు రూ.1,399), యాక్ట్ ఇన్‌క్రెడిబుల్ (నెలకు రూ.1,999) బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు తీసుకోవలసి ఉంటుంది.

ఇక ఢిల్లీలో అయితే.. యాక్ట్ ప్లాటినమ్ ప్రోమో(నెలకు రూ.999) మరియు యాక్ట్ డైమండ్ (నెలకు రూ.1249)బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు తీసుకున్న వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. చెన్నైలో యాక్ట్ ఫైబర్ నెట్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగిస్తున్న వారు ఈ ఆఫర్ కోసం యాక్ట్ బ్లాస్ట్ ప్రోమో, యాక్ట్ స్టార్మ్, యాక్ట్ ఇన్‌క్రెడిబుల్, యాక్ట్ థండర్, యాక్ట్ లైట్నింగ్ మరియు యాక్ట్ గిగా ప్లాన్లు తీసుకోవలసి ఉంటుంది.

హైదరాబాద్‌లో యాక్ట్ ఫైబర్ నెట్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగిస్తున్న వారు ఈ ఆఫర్ పొందడానికి ఎ-మ్యాక్స్ 1299, ఎ-మ్యాక్స్ 1050, ఇన్‌క్రెడిబుల్ 1999 లేదా యాక్ట్ గిగా ప్లాను తీసుకోవలసి ఉంటుందని సంస్థ ఈ ఆఫర్‌కి సంబంధించి చేసిన ట్వీట్‌లో పేర్కొంది.

అలాగే యాక్ట్ లైట్నింగ్ మరియు యాక్ట్ ఇన్‌క్రెడిబుల్ ప్లాన్లు తీసుకునే వినియోగదారులు ఒకటి లేదా రెండు నెలలు ఈ ఉచిత అదనపు డేటా సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.

- Advertisement -