

హైదరాబాద్: తెలుగు సినీ ఇండస్ట్రీలో ‘మహానటి’ సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకుంది హీరోయిన్ కీర్తి సురేష్. ఈ ఒక్క సినిమాతో టాలీవుడ్‌లో అగ్ర నటిగా ఎదిగింది. అలాగే తమిళంలో కూడా ఈ భామ అగ్రకథానాయికగా కొనసాగుతోంది. తమిళంలోని దాదాపు అగ్రహీరోలందరితోనూ నటించి స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది.
ఈ నేపథ్యంలో ఇటీవల సూపర్‌స్టార్ రజినీకాంత్ సరసన నటించే అవకాశం కూడా కీర్తిని వరించింది. దర్శకుడు మురుగదాస్, రజినీ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తిని అనుకున్నారు. అయితే ఇప్పుడు కీర్తి స్థానంలోకి నయనతార వచ్చినట్టు తెలుస్తోంది.
వయసు బాగా తక్కువ అవడంతో…
రజినీ కంటే కీర్తి వయసులో 42 ఏళ్లు చిన్నది. రజినీ కూతుళ్ల కంటే కూడా కీర్తి వయసు దాదాపు పదేళ్లు తక్కువ. ఇంత తక్కువ వయసు అమ్మాయితో రొమాన్స్ చేయడం బాగోదని ఆ చిత్ర బృందం భావిస్తోందట. ఒకవేళ హీరోయిన్‌గీ కీర్తి సురేష్‌ను గనుక తీసుకుంటే విమర్శలు కూడా వచ్చే అవకాశముందని భావిస్తున్నారట. అందుకే కీర్తి స్థానంలో నయనతారని తీసుకోవాలని అనుకుంటున్నారన్నది సినీ వర్గాల టాక్.








