25.2 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ టీడీపీకి మళ్లీ షాక్! వైసీపీలోకి అమలాపురం ఎంపీ? బుజ్జగింపుల పర్వంలో టీడీపీ కీలక నేతలు..

టీడీపీకి మళ్లీ షాక్! వైసీపీలోకి అమలాపురం ఎంపీ? బుజ్జగింపుల పర్వంలో టీడీపీ కీలక నేతలు..

amalapuram-mp-pandula-ravindrababu
- Advertisement -

pandula-ravindrababu-letter-to-chandrababu

అమలాపురం: ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఫిరాయింపు రాజకీయాలు పెరిగాయి. కొంతకాలం క్రితం వరకూ వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి అధికార టీడీపీలోకి ఫిరాయిస్తున్న వారు మాత్రమే కనిపిస్తుండగా, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్‌లోకి వలసలు ప్రారంభమయ్యాయి.

ఇటీవలే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ టీడీపీకి రాజీనామా చేసి, వైసీపీలో చేరిన సంగతి అందరికీ తెలిసిందే.

టీడీపీ కీలకనేతల బుజ్జగింపులు…

తాజాగా, అమలాపురం లోక్‌సభ సభ్యుడు పండుల రవీంద్రబాబు కూడా వైసీపీ వైపు చూస్తున్నట్లు సమాచారం. కొంత కాలంగా ఆయన పార్టీ మారనున్నారన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఆయన మాత్రం తాను టీడీపీని వీడనని చెబుతున్నప్పటికీ.. కొంతకాలంగా వైసీపీ నేతలతో ఆయన ఈ దిశగా చర్చలు జరుపుతూనే ఉన్నారని తెలుస్తోంది.

నేడో, రేపో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌‌ను కూడా రవీంద్రబాబు కలవనున్నారని, ఆపై ఆయన ఆ పార్టీ కండువాను కప్పుకుంటారని సమాచారం. ఇలా ఒకరివెంట ఒకరు పార్టీని వీడడానికి సిద్దమౌతుండడంతో ఈ వలసలకు అడ్డుకట్ట ఎలావేయాలో తెలియక టీడీపీ కీలక నేతలు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. మరోవైపు రవీంద్రబాబును బుజ్జగించే ప్రయత్నాలు కూడా ఇప్పటికే మొదలెట్టినట్లు సమాచారం.

చదవండి : వైసీపీలోకి జంప్ అవుతున్న టీడీపీ కీలకనేతలు! అసలు కారణం ఇదే… 

- Advertisement -