

ఈ మధ్య కాలంలో సెల్ఫీల పిచ్చి బాగా ఎక్కువైపోయింది. ఎంతగా అంటే సెల్ఫీల కోసమే మొబైల్ తీసుకునేంతలా మారిపోయారు. ఎక్కడికి వెళ్లినా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాకూడా సెల్ఫీ తీసుకోవడం అనేది పరిపాటిగా వస్తుంది. ఈ మధ్య కాలంలో సెల్ఫీలు తీసుకుంటూ మరణించిన వారి సంఖ్య కూడా పెరిగిపోతుంది.
ఇకపోతే గత కొన్ని రోజులు ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నది. ఓ చెప్పుతో చిన్నారులు సెల్ఫీ తీసుకుంటున్నారు. ఆ ఫోటోను నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు. మాములు వ్యక్తుల దగ్గర నుండి సెలబ్రిటీలు సైతం ఆ ఫోటోపై స్పందించారు. బాలీవుడ్ సెలబ్రిటీలు అనుపమ్ కేర్, సునీల్ శెట్టి, అతుల్ కస్బేకర్, అమితాబ్ బచ్చన్, బొమన్ ఇరానీ లాంటి వాళ్లు ఆ లిస్ట్‌లో చేరారు.
సెలబ్రిటీలు సైతం ఫిదా..
కొంతమంది చిన్నారులు సెల్ఫీ కోసం ఫోజు పెట్టిన సందర్భం అది. ముఖమంతా నింపుకున్న నవ్వులతో ఆ చిన్నారులు చాలా అందంగా ఉన్నారు. ఫొటోకైతే సెల్ఫీ ఫోజు పెట్టారు కానీ, వాళ్ల దగ్గర మొబైల్ లేదు. అదే ఈ సెల్ఫీ ఫొటో ప్రత్యేకత. చెప్పును చేతికి తగిలించుకుని.. మొబైల్ పట్టుకున్నట్టు, ఓ చిన్నారి ముందు నిలుచోగా, మిగిలిన చిన్నారులు సెల్ఫీకి రెడీ అయినట్టుగా నిలబడ్డారు. వాళ్లలోని అమాయకత్వం, నిర్మలమైన నవ్వులు, చూసినవారికి కంటినిండా సంతోషాన్ని అందిస్తున్నాయి.
కానీ, దీనిపై బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ మాత్రం కాస్త బిన్నంగా స్పందించారు. మీరు నన్ను క్షమించాలి.. ఆ ఫోటో ఫోటోషాప్ చేసిందనుకుంటా. ఎందుకంటే..ఆ పిల్లాడు చెప్పును పట్టుకున్న చేయి..అతడి మిగతా శరీర భాగాలకు సరితూగడం లేదు.. అంటూ ట్వీట్ చేశారు.
.. with due respect and apology .. i feel this is photoshopped .. notice that the hand that holds the chappal is different than the rest of his body in size .. to his other hand by his side !!
— Amitabh Bachchan (@SrBachchan) February 3, 2019
Amit ji ??
Nice to hear from uChecked wt 3 post prod experts independently
– Doo Creative, Hyd
– Khurshed Poonawala
– @HappyFinishAsiaAll of them said it’s NOT photoshopped
The hand wt the chappal looking enlarged is a matter of perspective distortion standard on smartphones— atul kasbekar (@atulkasbekar) February 4, 2019
This is not Photoshop edit …
Very possible with close angle photo the hands looking bigger .
The other chappal is there too— Bhupen Sinha (@bksCG) February 4, 2019
Not photoshopped. One kid is wearing the other chappal.
And he is the only one who wears one. They show beautifully… happiness is not what you have, happiness is who you are ! pic.twitter.com/cDqN3Pe3Ye— Arpita ?? (@arpita_dg) February 4, 2019
All kids are barefoot except the one middle.
He is wearing only left Chappal and other foot is in air.
The right Chappal is in hand, acting as mobile.
Kids not having Chappals but Mobile, I highly doubt that. pic.twitter.com/HefPn2cbNj— Anil Pandita (@anilenigma) February 4, 2019








