భారతదేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, సుమారు రూ.400 కోట్లతో తీస్తున్న భారీ చిత్రం.. ‘2.0.’ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, అక్షయకుమార్ విలన్ గా .. భారీ బడ్జెట్ సినిమాలు తీసే టాప్ డైరెక్టర్ శంకర్, ఆస్కార్ అవార్డు గ్రహీత.. ఏఆర్ రెహ్మాన్.. ఇలా ప్రముఖులు అందరూ కలిసి నటించి, తీస్తున్న సినిమా 2.0.
ఇంతకుముందు వచ్చిన రోబో (2010)కి ఈ సినిమా సీక్వెల్ గా చెబుతున్నారు.. కానీ రజనీకాంత్.. అదే చిట్టి.. ఏం చెబుతున్నాడంటే.. ఇది కేవలం .. ఆ సినిమాలో రెండు పాత్రలు.. 1. చిట్టి 2. వశీకరణ్.. వీరిని మాత్రమే తీసుకుని రూపొందించిన సినిమా అని. ఈ అద్భుత సైన్స్ ఫిక్షన్ సినిమా సరికొత్త వివరాలు.. మీకోసం…
పాటలే వద్దనుకున్నారట..
మొదట ఈ సినిమాలో పాటలే లేకుండా సినిమా తీద్దామని డైరెక్టర్ శంకర్ అనుకున్నారు.. ఆ తర్వాత ఒక టైటిల్ సాంగ్ ప్లాన్ చేశారు.ఆ తర్వాత బ్యాక్ గ్రౌండ్ సాంగ్ ఒకటి వచ్చి చేరింది. ఆ తర్వాత సంగీత దర్శకుడు రెహ్మాన్ కోరిక మేరకు.. మరొక పాట సృష్టించారు. ఇలా పాటలే వద్దనుకున్న సినిమాలో నాలుగుపాటలయ్యాయి.
ఎందుకు పాటలు వద్దనుకున్నారంటే సినిమా మొదటి నుంచి చివరి వరకు సీరియస్ గా ఉంటుంది. అది డిస్ట్రబెన్స్ అవుతుందని పాటలు వద్దనుకున్నట్లు రజనీ చెబుతున్నారు.
అయితే మన భారతీయులు సంగీత ప్రియులు.. వారిలో సంగీతం..జీర్ణించుకుపోయింది. అది సినిమా పాట రూపంలో కానివ్వండి..మరో రూపంలో కానివ్వండి.. ఎలాగైనా సరే.. థియేటర్ కి వచ్చాక.. వారికీ పాటలను కూడా జోడించడం .. మా టీమ్ అంతటికి ఎంతో సంతృప్తిగా ఉంది. లేదంటే ఎక్కడో చిన్న ఫీలింగ్.. ప్రస్తుతం అదిపోయిందని అన్నారు.
’2 0’ సినిమా విజువల్ వండర్..
టెక్నికల్ గా సినిమా ఎంతో గొప్పగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది విజువల్ వండర్ గా పేర్కొనాలి. నిజానికి నటులు చేసినది చాలా తక్కువ. సాంకేతిక నిపుణులు శ్రమే ఎక్కువగా సినిమాలో కనిపించడం విశేషం. ఒకొక్క సన్నివేశం స్క్రీన్ పై చూస్తుంటే .. అద్భుతంగా ఉందని టెక్నిషియన్లు చెబుతున్న మాట..
నిజానికి డైరెక్టర్ శంకర్ చాలా కష్టపడ్డాడు. ప్రతీ సీన్ అతను చేసి చూపించాడని.. నటీనటులు చెబుతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే తనలో ఒక గొప్ప నటుడున్నాడని రజనీకాంత్ కితాబు కూడా ఇచ్చారు.
శంకర్ ఓ సైంటిస్ట్ అని చెప్పాలి…
2.0 సినిమా క్రెడిట్ పూర్తిగా శంకర్ కే దక్కుతుందని అందరి మాట.. నిజం చెప్పాలంటే.. తను ఇండియాలో సైన్స్ ఫిక్షన్ మాస్టర్ అయిపోయాడు.. నిజంగా ఒక సైంటిస్టు ఎలా చేస్తాడో అలాగే చేశాడని చెబుతున్నారు. ముందు రోబో వీడియోలు టెక్నిషియన్లు, నటీనటులకు చూపించారు.. తర్వాత శంకర్ ఎంతో రీసెర్చ్ చేసేవారు.. ఆ తర్వాత తమకు వివరించేవారని.. రజనీకాంత్ తెలిపారు.
ఎందుకంటే ముందు నటించేవారికి, పనిచేసేవారికి ఒక అవగాహన రావాలి. అందుకే వీడియోలు చూపించారు. రెండు.. వీరేమైనా డౌట్స్ అడిగితే.. సెట్లో ఉండేది తనే కనుక.. వారికి క్లారిఫై ఇవ్వాలి. అందుకు శంకర్ రీసెర్చ్ చేసేవాడని తెలిపారు. ఆ తర్వాత షూటింగ్ స్టార్ట్ అయ్యేది. ఇలా నాలుగేళ్లకు పైగానే సినిమా రూపుదిద్దుకోవడం విశేషం.
ఇక సంగీతం విషయానికి వస్తే.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉండాలని అనుకున్నారు. ఆ విజువల్ వర్క్ ఎఫెక్టుకి తగినట్టుగా రెహ్మాన్ హాలీవుడ్ స్థాయిలో ఇచ్చి సినిమాని.. సంగీతంతో నిలబెట్టాడని అంటున్నారు. అలాగే తను కూడా అంతర్జాతీయ స్థాయి సంగీత దర్శకుడు కావడం, ఆస్కార్ అవార్డు కూడా గెలుచుకోవడం.. ఇలాంటి గొప్ప టెక్నిషియన్లు మన ఇండియాలోనే ఉండటం సినిమాకి కలిసి వచ్చే అంశంగా మారింది..
అక్షయకుమార్ కి మేకప్ వేయడానికి ముందు ముఖమంతా గమ్ పూసేవారంట..అది మళ్లీ షూటింగ్ అయ్యాక తీసేసేవారు. అలా ఇన్ని సంవత్సరాలు షూటింగు జరిగినన్ని రోజులు.. విసుక్కోకుండా వచ్చి షూటింగ్ చేయడం గొప్ప విషయం.. ఎందుకంటే ఆయన కాల్షీట్లు కూడా అడ్జస్ట్ చేయడం.. అక్షయ్ కి సినిమా పట్ల ఉన్న ప్రేమని తెలియజేస్తుందని రజనీకాంత్ తెలిపారు. ఆ అంకితభావం చూసి ముచ్చటేసిందని అని అన్నారు.
సినిమా కథ ఇదే.. అంటున్నారు..
రోబో సినిమాలో.. చిట్టి విలన్ గా మారి.. విధ్వంసం సృష్టిస్తే.. ‘2.0’లో అదే చిట్టి హీరోగా వస్తాడన్న మాట.. అంటే విలన్ గా నటిస్తున్న అక్షయకుమార్ చేస్తున్న ఆగడాలను.. అణచివేయడానికి.. ‘ఎవరున్నారు.. ఎవరున్నారు..’ అని జేమ్స్ బాండ్ సినిమాలో అన్నట్టు అంటుంటే.. అదిగో అప్పుడు వస్తాడు.. మన చిట్టి..
అలా మళ్లీ వశీకరణ్ చిట్టికి ప్రాణ ప్రతిష్ఠ చేసి.. అంతకుముందు చేసిన పొరపాట్లు చిట్టి చేయకుండా జాగ్రత్తలు తీసుకొని..విలన్ పైకి వశీకరణ్ పంపిస్తాడు.. అలాగే మొదటి సినిమాలో ఐశ్వర్యారాయ్ ని ప్రేమించి హడావుడి చేస్తాడు. అందుకే ఒక రోబో హీరోయిన్.. అదేనండీ విక్రమ్ ‘ఐ’ సిినిమాలో హీరోయిన్ అమీ జాక్సన్.. వచ్చి.. చిట్టి మనసు కొల్లగొడుతుందేమో చూడాలి.
మొత్తానికి.. మా మంచి చిట్టిబాబుగా అందరి ప్రశంసలు పొందుతాడు.. ఇది సింగిల్ లైన్ స్టోరీ.. ఇక అద్భుతాలన్నీ వెండి తెరపై చూడాల్సిందే..( ఇది ఒక ఊహ మాత్రమే..) (అంటే బాహుబలి2లో.. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అనే ప్రశ్నకు వచ్చిన కథలాగే దీనిని తీసుకోవాలి సుమా..)
ప్రపంచమంతా ఎదురుచూస్తున్న సినిమా..
మొదట ఈ సినిమాకి విలన్ గా హాలివుడ్ కండల వీరుడు ఆర్నాల్డ్ స్కావర్జెనగర్ అనుకున్నారు. ఆ ఉత్సాహంతోటే.. ఆడియో ఫంక్షన్ కి కూడా పిలిచారు. అలా అతను వచ్చి వెళ్లినందుకే కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.కానీ విలన్ అనగానే అతను ఒప్పుకోలేదు. లేదా అతనడిగిన కోట్లు ఇవ్వలేక కూడా వెనుకంజ వేసి ఉండవచ్చు..
ఒకటి మాత్రం నిజం.. ఆర్నాల్డ్ ని పిలిచి.. సినిమావైపు ప్రపంచం దృష్టి మరల్చేలా చేశారు. అయితే అనుకోకుండా వీఎఫ్ ఎక్స్ వర్క్ ఆలస్యం కావడం.. ఇలా రకరకాలుగా రిలీజింగ్ డేట్లు వాయిదా పడుతూ వచ్చాయి. ఆ తర్వాత రిలీజ్ డేట్ ని ప్రకంటించడం మానేశారు. కామ్ గా సినిమా తీస్తూ వెళ్లిపోయారు.
ఇప్పుడిప్పుడే మళ్లీ 2.0 విశేషాలు మళ్లీ హల్ చల్ చేస్తున్నాయి. దీంతో సినీ అభిమానులే కాదు. సైన్స్ ఫిక్షన్..అంటే ఆసక్తి ఉన్నవారు, ఇక 130 కోట్ల మంది భారతీయులు ఇప్పుడు ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా..2.0
అబ్బబ్బో.. వాళ్లేం తీశార్రా.. అని హాలివుడ్ సినిమాలు చూసి అనుకునేవారు..
కొన్నేళ్ల క్రితం వరకు అంటే మొన్నటికి మొన్న ‘అవతార్’ సినిమా చూసే వరకు కూడా.. అబ్బా..వాళ్లేం సినిమా తీశార్రా.. తీస్తే వాళ్లే తీయాలి..మనోళ్లూ ఉన్నారెందుకు? అని హాలీవుడ్ సినిమాలు చూసి నూటికి 99శాతం అనుకునే మాట ఇది.. కానీ ఇప్పుడా బండారం బట్టబయలైపోతోంది. ఓస్ ఇంతేనా? అన్నట్లు మన శంకర్ తీసేస్తున్నాడు.
ఇన్నాళ్లూ..మన భారతీయ ప్రేక్షకులను వెర్రివాళ్లను చేసి..ఒక ఆట ఆడించారు. ఇప్పుడు 2.0 సినిమాతో.. ఆ తోలుబొమ్మలాట మనవాడు ఆడిస్తున్నాడు. ఇక వీఎఫ్ ఎక్స్ (విజువల్ ఎఫెక్ట్స్) భారతదేశంలో చరిత్ర సృష్టించనున్నాయి. ఒక అద్భుతాన్ని ఆవిష్కరించనుందని చెప్పవచ్చు. ఇంతవరకు హాలీవుడ్ సినిమాలకు మాత్రమే పరిమితమైన విజువల్ ఎఫెక్టులు..మనం కూడా చేయవచ్చునని శంకర్ నిరూపిస్తున్నాడు. మనం కూడా హాలీవుడ్ సినిమాలకు ధీటుగా భారతీయ సినిమా తీసిపోదని నిరూపిస్తున్నాడు. ఇది భారతీయులందరికి గర్వకారణం..
2.0 సినిమాలో పనిచేసిన టెక్నిషియన్లు,ఇతర సాంకేతిక సిబ్బంది, వృత్తి పనివాళ్ల వివరాలు చూడండి..
ప్రొడక్షన్ డిజైన్ టీమ్.. కృషి.. 
- 4.. బ్రహ్మాండమైన భారీ.. భారీ సెట్టింగులు..
- వాటిలో చైన్నై సిటీ జంక్షన్ లాంటివి కూడా ఉన్నాయి.
- రోజూ 100 మంది వెల్డర్లు పనిచేశారు.
- 250 మంది కార్పెంటర్లు పనిచేశారు.
- 50 మంది పెయింటర్లు
- 25మంది మౌల్డర్లు
- 10 మంది కాన్సెప్ట్ డిజైనర్లు
- 15 మంది ‘3 డి’ డిజైనర్లు
- 5 గురు ఆర్ట్ డైరెక్టర్లు
ప్రాజెక్టులో భాగస్వామ్యం వీరిదే…
- 20.. వీఎఫ్ ఎక్స్ స్టూడియోస్
- 5… యానిమేషన్ స్టూడియోస్
- సుమారు 3,400 వీఎఫ్ ఎక్స్ షాట్స్..
- 1000 వీఎఫ్ ఎక్స్ ఆర్టిస్టులు..
- పెరల్ హార్బర్, ట్రాన్స్‌ఫార్మర్స్, డార్క్ ఆఫ్ ది మూన్, గ్లాడియేటర్, మ్యాడ్‌మ్యాక్స్.. ఇలాంటి సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలను తీసిన హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు ఎలా తీశారో తెలుసుకొని, కొందరితో మాట్లాడి.. ఆ స్థాయిలో తమిళ్ స్టంట్ మాస్టర్ శివ డిజైన్ చేశారు.
– శ్రీనివాస్ మిర్తిపాటి