అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్, అసలేం జరిగిందంటే…

tamil-superstar-rajini-kanth
- Advertisement -

super-star-rajini-kanth

చెన్నై్: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ స్టయిలే వేరు.  ఆయన ఏం చేసినా వెరైటీయే.  ఎంత ఎత్తుకు ఎదిగినా ఆయన ఒదిగే ఉంటారనడానికి నిదర్శనమీ ఘటన. అంతేకాదు, సూపర్ స్టార్ తాజాగా చేసిన ఈ పని ఆయన అభిమానులను దిగ్భ్రాంతికి కూడా గురి చేసింది.

అసలేం జరిగిందంటే… రజినీకాంత్ నివాసం స్థానిక పోయస్ గార్డెన్‌లో ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయన తన కుమార్తె ఐశ్వర్య ఇంటికి వెళ్లడం తన నివాసం నుండి ఆటోలో ప్రయాణించారు. ఎప్పుడూ కారులోనే ప్రయాణించే రజినీ హఠాత్తుగా ఇలా ఆటోలో ప్రయాణించడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది.

చదవండి: శబరిమల వివాదం: తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ ఏమన్నారంటే…

రజినీకాంత్ ప్రస్తుతం కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేస్తోన్న ‘పేటా’ అనే సినిమాలో నటిస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక రాజకీయం విషయానికొస్తే… రజినీకాంత్ త్వరలోనే తన పార్టీ పేరుని ప్రకటిస్తారని ఆయన సోదరుడు సత్యనారాయణ ప్రకటించిన విషయం తెలిసిందే.  అంతేకాదు, సూపర్‌స్టార్ రాజకీయ ప్రవేశంలో బీజేపీకి ఎలాంటి జోక్యం లేదని కూడా ఆయన తెలిపారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం… వచ్చే డిసంబర్ నాటికి రజినీకాంత్ కొత్తగా పెడుతున్న పార్టీకి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ పూర్తి అవుతాయి. ఆ తరువాత రజినీకాంత్ తన కొత్త రాజకీయ పార్టీ గురించి అధికారికంగా ప్రకటన చేస్తారు.

- Advertisement -