అయితే గతనెల ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల కురుక్షేత్రంలో రోజా నాగబాబులు వేరువేరు పార్టీల అభ్యర్ధులుగా పోటీ చేయడంతో ఈ జంట విడిపోయింది. దీనితో ఈ షోను కొన్ని వారలపాటు మీనా శేఖర్ మాష్టర్లను జడ్జీలుగా పెట్టి ఈ షోను కొనసాగించారు. అయితే ఎన్నికలు ముగిసిన తరువాత రోజా తన స్థానంలోకి తిరిగి వచ్చినా నాగబాబు తన స్థానంలోకి రాలేదు.
ఇప్పుడు జడ్జి స్థానంలో నాగబాబు లేకుండానే మీనా స్థానంలో సంఘవి చేరి ఈ షోను రోజాతో కొనసాగిస్తోంది. కన్నడ బ్యూటీ అయిన సంఘవి ఒక పదిహేనేళ్ళ క్రితం స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. చిరంజీవి బాలకృష్ణ నాగార్జున లాంటి స్టార్ల సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది.
ఇప్పుడు చాలా కాలం తర్వాత ఇలా జబర్దస్త్ కార్యక్రమంలో సంఘవి కనిపించడం బుల్లితెర ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. అయితే ఈ మార్పులు ఇలా కొనసాగుతూ ఉండగానే ఇప్పటికీ నాగబాబు ఈ షోలో ఎందుకు రీ ఎంట్రీ ఇవ్వలేకపోతున్నాడు అన్న విషయమై చర్చలు జరుగుతున్నాయి.
దీనితో ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత నాగబాబు ఎంట్రీ ఉంటుందా ఒకవేళ రాబోయే ప్రభుత్వంలో రోజా అనుకున్న విధంగా మంత్రి అయితే ఇక ఈ షోకు సంబంధించి రోజా నాగాబాబుల జంట విడిపోవడం ఖాయం అన్న అంచనాలు వినిపిస్తున్నాయి..