26.3 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ మే 23 తర్వాత మోడీ హిమాలయాలకే!: టీడీపీ నేత యామిని హాట్ కామెంట్స్!

మే 23 తర్వాత మోడీ హిమాలయాలకే!: టీడీపీ నేత యామిని హాట్ కామెంట్స్!

- Advertisement -

అమరావతి: ఏపీలో ఎన్నికల కౌటింగ్ సమయం దగ్గర పడే కొద్దీ విమర్శలు పర్వం ఎక్కువైపోతోంది. ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఈ సమయంలోనే ప్రధాని మోడీ మేకిన్ ఇండియా కార్యక్రమం ప్రారంభించాక ఒక్క కంపెనీ కూడా దేశంలోకి రాలేదని టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని విమర్శించారు.

మహిళలంతా తనకే ఓటేశారని ప్రధాని మోడీ ఇటీవల ఓ ఎన్నికల ప్రచార సభలో చెప్పడం విడ్డూరంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఈ నెల 23న లోక్ సభ ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత మోడీ హిమాలయాలకు వెళ్లడం ఖాయమని యామిని జోస్యం చెప్పారు.

అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో సాధినేని యామిని మాట్లాడారు. మోడీ పాలన జర్మనీ నియంత హిట్లర్‌ను తలపిస్తోందంటూ దుయ్యబట్టారు. ఏపీ ప్రజల పౌరుషం అంటే ఏమిటో మే 23న మోడీ, జగన్, కేసీఆర్‌లకు తెలుస్తుందని వ్యాఖ్యానించారు.

అంతేకాదు, రాజకీయాల్లో జగన్, కేసీఆర్, మోడీలకు ఆస్కార్ ఇవ్వొచ్చంటూ యామిని ఎద్దేవా చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా టీడీపీ విజయాన్ని ఆపలేరనీ, చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆమె స్పష్టం చేశారు.

చదవండి:  ఏపీలో జగన్ ప్రభావం అప్పుడే మొదలైందా? కసరత్తులు ప్రారంభించిన జిల్లా అధికారులు!
 
 
- Advertisement -