28.2 C
Hyderabad
Sunday, October 11, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ ఏపీలో అందరి దృష్టి ‘నగరి’పైనే..! మరి రోజా గెలుపు ఖాయమేనా?

ఏపీలో అందరి దృష్టి ‘నగరి’పైనే..! మరి రోజా గెలుపు ఖాయమేనా?

- Advertisement -
చిత్తూరు: ఏపీలో ఎన్నికలు ముగిసినా ఫలితంపై ఉత్కంఠ కొనసాగుతోంది. మే 23వ తేదీ వరకు ఫలితాల కోసం వెయిట్ చేయడం అన్ని రాజకీయ పక్షాలకూ ఇబ్బందిగానే మారింది. ఇప్పటికే చాలా మంది నాయకులు వివిధ రూపాల్లో ప్రజలు ఎవరి ఓటు వేశారనే విషయాన్ని అంచనా వేసుకుని, తమ గెలుపు ఓటములపై లెక్కలు కడుతున్నారు.
 

ఇక, కీలకమైన నాయకులు పోటీ చేసిన నియోజకవర్గాల్లో ఈ ఉత్కంఠ, సర్వేలు మరింత జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంపై అంచనాలు ఊపందుకున్నాయి.

ఇక్కడ నుంచి స్టార్ హీరోయిన్ , వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా రెండో సారి పోటీ చేస్తుండడంతో అంచనాలు పెరిగాయి. గత ఎన్నికల్లో మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడుపై పోటీ చేసిన రోజా స్వల్ప తేడాతో విజయం సాధించారు. ఇక, ఇప్పుడు గాలి వారసుడు భాను ప్రకాశ్‌పై ఆమె పోటీ చేసింది. అయితే, ఇక్కడ చిత్రమైన విషయాలు చోటు చేసుకున్నాయి.

వైసీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థిగా రోజా పేరు ఎప్పుడో ఖరారు అయినప్పటికీ, అధికార టీడీపీ నుంచి మాత్రం అభ్యర్థి విషయంలో చివరి నిముషం వరకు కూడా తర్జన భర్జనలు కొనసాగాయి.
 
మాకంటే మాకే టికెట్ ఇవ్వాలంటూ ‘గాలి’ ఫ్యామిలీలోనే తగవులు ప్రారంభం కావడంతో పరిస్థితిని సరిదిద్దేందుకు సీఎం చంద్రబాబు ఏకంగా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను రంగంలోకి దింపాల్సి వచ్చింది. ఆయన రాయబారంతో చివరి నిముషంలో భాను ప్రకాష్‌కు టికెట్ ఖరారు చేశారు.
 

చదవండి:  తన గెలుపుపై పక్కా లెక్కలు చెబుతున్న టీడీపీ సీనియర్ నేత…

అయితే, అప్పటికే నగరిలో రోజా దూకుడు ప్రదర్శించారు. రూ.4కే రోజా క్యాంటీన్లు ప్రారంభించారు. నియోజకవర్గంలో మొబైల్ రూపంలో నిర్వహించిన ఈ క్యాంటీన్లకు మంచి ఆదరణ ఏర్పడింది.

అదేసమయంలో నియోజకవర్గంలో మహిళలను ఆకట్టుకునేందుకు పుసుపు-కుంకుమ పేరుతో ఇంటింటికీ తిరిగి బొట్టు పెట్టి మరీ అందరినీ తనకు అనుకూలంగా తిప్పుకొన్నారు. అదేస సమయంలో ఆమె వివాదాలకు, అక్రమాలకు దూరంగా ఉన్నారు. అయినా సరే, రోజా నియోజకవర్గంలో ఉండరని, హైదరాబాద్‌కే పరిమితమవుతున్నారనే వ్యాఖ్యానాలు వచ్చాయి.

ఈ విషయంలో కూడా టీడీపీ నేతలకు ఆమె చెక్ పెడుతూ, దాదాపు రూ.10 కోట్ల సొంత వ్యయంతో రోజా తన నియోజకవర్గమైన నగరిలోనే సొంత ఇల్లు కట్టుకున్నారు. ఇక నియోజకవర్గంలోని పేదలకు అన్నదానాలు చేయడం వంటివి కూడా ఆమెకు బాగానే కలిసి వచ్చాయి. వీటన్నింటికీ తోడు ప్రజలలో పార్టీ అధినేత వైఎస్ జగన్‌కి ఉన్న ఇమేజ్ కూడా మరింత ప్లస్ అవుతోంది.

మొత్తానికి చూసుకుంటే.. ‘గాలి’ సెంటిమెంట్ పనిచేస్తుందని అనుకున్న తరుణంలో.. నియోజకవర్గంలో ఆ కుటుంబంలో ఏర్పడిన వివాదాలను తనకు అనుకూలంగా మలచుకోవడంలో రోజా సక్సెస్ అయ్యారు అనే చెప్పాలి. కాకపోతే రోజా గెలుపు ఖాయమే అయినా అది మరీ అంత ఈజీగా అయితే ఉండదని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఫలితం వచ్చే ఎదురు చూడాల్సిందే. చూడాలి మరి ఓటర్ల తీర్పు ఏ విధంగా ఉంటుందో?
 
- Advertisement -