హైదరాబాద్: బుల్లితెరకి సంబంధించిన ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-3 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. సీజన్-1, 2 లకు హోస్ట్‌లుగా జూనియర్ ఎన్టీఆర్, హీరో నాని వ్యవహరించగా.. తాజా సీజన్-3కి హీరో నాగార్జున హోస్ట్‌గా ఫిక్సవడంతో ఈ రియాలిటీ షోపై బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఉన్నారు.
చదవండి: సంచలనం: శ్రీదేవి మరణం ప్రమాదం కాదు.. హత్యే!: కేరళ జైళ్ల శాఖ డీజీపీ వెల్లడి…
సరిగ్గా ఇదే తరుణంలో యాంకర్, జర్నలిస్ట్ శ్వేతారెడ్డి బిగ్‌బాస్ షోపై, దాని నిర్వాహకులపై మీడియా సాక్షిగా విరుచుకుపడ్డారు. బిగ్‌బాస్ రియాలిటీ షో తెరవెనుక బ్రోతల్ హౌస్ నడుపుతున్నారంటూ ఆమె సంచలన ఆరోపణలు చేశారు. గురువారం సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన శ్వేతారెడ్డి ఆ షో నిర్వాహకులపై ఓ రేంజ్లో మండిపడ్డారు.
‘బిగ్‌బాస్’ తెరవెనుక ఏం జరుగుతోంది?
ఈ రియాలిటీ షో వెనుక సాగుతున్న కాస్టింగ్ కౌచ్ జరుగుతోందని ఆరోపించిన శ్వేతారెడ్డి.. ”బిగ్ బాస్ షోలో పాల్గొనాలంటే వాళ్ల బాస్‌ని ఇంప్రెస్ చేయాలట.. ఉత్తరాది గబ్బు సంస్కృతిని తెలుగు వాళ్లపై రుద్దాలని అనుకుంటున్నారా? అసలు ఈ రియాలిటీ షోని తెలుగు టీవీ నుండి వెలివేయాలి.. బిగ్‌బాస్ షో ముసుగులో నిర్వాహకులు బ్రోతల్ హౌస్ నడుపుతున్నారా..?” అంటూ తీవ్ర విమర్శలు చేశారు.
బిగ్‌బాస్ షో ముసుగులో దాని నిర్వాహకులు సాగిస్తోన్న బాగోతాన్ని బయటపెట్టడానికే తాను మీడియా సమావేశం ఏర్పాటు చేశానని చెబుతూ.. తనకూ వల వేసేందుకు ప్రయత్నించారని తెలిపింది.
చదవండి: కమెడియన్ అలీకి ఎమ్మెల్సీ గిఫ్ట్! సిద్ధం చేసిన సీఎం వైఎస్ జగన్?
ఏప్రిల్ లో బిగ్‌బాస్ షోకి సంబంధించిన ఓ వ్యక్తి తనకు ఫోన్ చేసి మీరు పాపులర్ యాంకర్, కాబట్టి మిమ్మల్ని సీజన్-3 కంటెస్టెంట్లలో ఒకరిగా ఎంపిక చేశామని తెలిపారని, ఆ తరువాత దీనికి సంబంధించి మీటింగ్ అంటూ రవికాంత్ అనే నిర్వాహకుడు పలుమార్లు తనను పిలిచారని శ్వేతారెడ్డి వివరించారు.
‘‘మా బాస్‌ని మీరెలా ఇంప్రెస్ చేస్తారు..?’’
అయితే ఈ మీటింగ్‌లకు తనతోపాటు వెంట వచ్చిన వారిని లోపలికి రానిచ్చేవారు కాదని, తనతో మాత్రమే మాట్లాడేవారని, తనతో అగ్రిమెంట్ మీద సైన్ కూడా చేయించుకున్నారని, కానీ ఆ అగ్రిమెంట్ జిరాక్స్ పేపర్లు కూడా తనకు ఇవ్వలేదని చెప్పారు.
ఇక ఆ తరువాత నుంచి పిచ్చి వేషాలు మొదలెట్టారని, తనకు ఫోన్ చేసి.. ‘‘మిమ్మల్ని షోలోకి తీసుకున్నందుకు మా బాస్‌ని మీరెలా ఇంప్రెస్ చేస్తారు?’’ అంటూ ప్రొడ్యూసర్ శ్యామ్ తనను పలుమార్లు అడిగారని శ్వేతారెడ్డి పేర్కొన్నారు.
చదవండి: ‘‘మా ఆయనతో సమంత కేక్ కటింగ్.. నేను హర్ట్..’’: శ్రీరెడ్డి తాజా సంచలనం
‘‘నేను ఇంప్రెస్ చేయడం ఏమిటి?’’ అంటూ ప్రశ్నిస్తే.. లేదు.. లేదు.. కమిట్మెంట్ ఇవ్వాలంటూ పలుమార్లు వేధించారని, తాను గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి ఇక ఆ తరువాత తనను దూరం పెట్టారని, రియాలిటీ షో నడిపిస్తూ వీళ్లు చేస్తున్న పనులేంటి? మహిళా కంటెస్టెంట్లకు ఈ ‘కమిట్మెంట్’ వేధింపులేమిటి అంటూ యాంకర్ శ్వేతారెడ్డి మండిపడ్డారు.
బాధితులు ఎందరో?
ఈ తరహా వేధింపులు తననొక్కదానికే కాదని, గతంలో చాలామందిపై ఇలాగే కమిట్మెంట్ అంటూ వేధింపులకు పాల్పడ్డారని, తాను ఆ వివరాలన్నీ సేకరించానని, త్వరలోనే వాళ్లంతా బయటికి వస్తారని కూడా శ్వేతారెడ్డి చెప్పారు.
ఈ రియాలిటీ షోకి సంబంధించి తాను సంతకం చేసిన డాక్యుమెంట్లను తిరిగి ఇవ్వమని అడిగినా వారు ఇవ్వడం లేదని, ప్రస్తుతం బిగ్‌బాస్ నిర్వాహకులు రఘు, రవికాంత్, శ్యామ్ తమ తమ ఫోన్లను కూడా స్విచాఫ్ చేసుకున్నారని శ్వేతారెడ్డి పేర్కొన్నారు.
చదవండి: ‘‘జూనియర్ ఎన్టీఆర్‌తో అఫైర్.. మా ఇంట్లో తెలిసింది.. అందుకే సినిమాలకు దూరమయ్యా..’’
ఈ తరహా కాస్టింగ్ కౌచ్‌పై గతంలో శ్రీరెడ్డి పోరాటం చేసినప్పుడు వేసిన కమిటీ ఎక్కడికి పోయిందని, ఏం చేస్తోందని ఆమె ప్రశ్నించారు.
అంతేకాదు, ఇంతటితో తన పోరాటం ఇంతటితో ఆగదని స్పష్టం చేసిన ఆమె.. బిగ్‌బాస్ రియాలిటీ షో పేరిట తెరవెనుక చాలా మోసం జరుగుతోందని, మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తున్న ఈ రియాలిటీ షోని తెలుగు టీవీ రంగం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు.