27.1 C
Hyderabad
Saturday, November 28, 2026
- Advertisement -
Home క్రికెట్ భారత్ Vs న్యూజిలాండ్: 8 వికెట్ల తేడాతో కివీస్‌పై టీమిండియా ఘన విజయం, ధావన్ కీలక...

భారత్ Vs న్యూజిలాండ్: 8 వికెట్ల తేడాతో కివీస్‌పై టీమిండియా ఘన విజయం, ధావన్ కీలక ఇన్నింగ్స్…

kohli-dhawan
- Advertisement -

నేపియర్‌: ఆసీస్ పర్యటను విజయవంతంగా ముగించిన టీమిండియా ఇప్పుడు న్యూజిలాండ్ పర్యటనలో కూడా శుభారంభాన్ని అందుకుంది. భారత్‌-న్యూజిలాండ్‌ల మధ్య జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో కోహ్లీ సేన బోణీ కొట్టింది. తొలి వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

న్యూజిలాండ్ నిర్దేశించిన 156 పరుగులు లక్ష్యాన్ని 34.5 ఓవర్లలోనే ఛేదించింది. అయితే, భోజన విరామం తర్వాత మైదానంలోకి వచ్చిన భారత బ్యాట్స్‌మెన్‌ అస్తమిస్తున్న సూర్యుడి కిరణాలను తట్టుకోలేకపోయారు. దీంతో మ్యాచ్‌ను 30 నిమిషాలు పాటు నిలిపి వేశారు. ఆ తర్వాత డక్‌వర్త్‌ లూయిస్‌ నిబంధనల ప్రకారం మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించి టీమిండియాకు 156 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.

పదో ఓవర్‌లో బ్రేస్‌వెల్‌ వేసిన రెండో బంతికి రోహిత్‌ శర్మ.. గప్తిల్‌కి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ విరాట్‌ తోడుగా ధావన్ రెచ్చిపోయి ఆడాడు. ఇద్దరూ కలిసి బౌండరీలు బాదారు. విరాట్‌- ధావన్‌ జోడీ కలిసి జట్టుకు 91 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.

అర్ధ శతకం బాదిన శిఖర్ ధావన్

అయితే 29 ఓవర్లో కోహ్లీని లాకియా ఫెర్గూసన్‌‌ పెవిలియన్‌ చేర్చాడు. 29వ ఓవర్‌లో లాకియా వేసిన నాలుగో బంతిని ఆడిన కోహ్లీ(45).. లాథమ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. కాగా, అప్పటికి టీమిండియా విజయానికి 20 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది.

అనంతరం క్రీజులోకి వచ్చిన రాయుడు(13)తో కలిసి ధావన్(75) స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 24 పరుగుల అజేయ భాగస్వామ్యంతో టీమిండియాకు విజయాన్ని అందించారు. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. 6ఓవర్లు వేసి 3వికెట్లు తీసిన మొహమ్మద్ షమీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 10ఓవర్లు వేసిన కులదీప్ యాదవ్ 4వికెట్లు తీసి సత్తా చాటాడు.

- Advertisement -