కరోనా ఎఫెక్ట్: ట్రంప్ తాజా నిర్ణయం.. భారతీయులపై తీవ్ర ప్రభావం, అదే గనుక జరిగితే…

donald-trump-s-sensational-decision-on-immigration
- Advertisement -

వాషింగ్టన్: కరోనా దెబ్బకు అగ్రరాజ్యం అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

తమ దేశంలోకి తాత్కాలికంగా ఇతర దేశాల నుంచి వలసలు(ఇమ్మిగ్రేషన్) నిలిపివేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేసిన ట్రంప్.. త్వరలోనే దీనికి సంబంధించిన ఉత్తర్వులపై సంతకం చేయనున్నట్లు పేర్కొన్నారు. 

చదవండి: రిలయన్స్ జియో వినియోగదారులందరికీ గుడ్ న్యూస్!

ఇదే గనుక జరిగితే ఆ ప్రభావం ముఖ్యంగా ఆ దేశంలోకి అడుగుపెట్టాలనుకునే మన భారతీయులపై తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే, అమెరికాకు వలస వెళ్లే వారిలో మన భారతీయులు, చైనీయులే అధికం. 

42 వేలకుపైగా మరణాలు… 

కరోనా వైరస్ వ్యాప్తిని, మరణాలను అరికట్టలేక అమెరికా ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పటి వరకు ఈ వైరస్‌కు అక్కడ 42 వేలకుపైగా మరణించారు.

మరోవైపు దేశ వ్యాప్తంగా  కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా 8 లక్షలకు చేరుకుంటోంది. కరోనా కట్టడిలో భాగంగా కొన్ని రోజులుగా అమెరికాలో అమలు చేస్తోన్న షట్‌డౌన్ కూడా ఆ దేశ ఆర్థిక వ్యవస్థను బాగా దెబ్బతీసింది.

చదవండి: చెట్టెక్కిన ప్రొఫెసర్.. జేజేలు పడుతున్న నెటిజన్లు!

లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. అధికారిక లెక్కల ప్రకారమే అమెరికాలో 2.2 కోట్ల మంది నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. మరికొన్ని లక్షల మంది అదే బాటలో ఉన్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో తమ దేశ పౌరులకు ఉద్యోగ భద్రత కల్పించడం కోసమే ఆ దేశాధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. 

‘‘ఓ అదృశ్యశక్తి దాడి నేపథ్యంలో అమెరికా పౌరుల ఉద్యోగాలను కాపాడాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ నేపథ్యంలో అమెరికాలోకి ఇతర దేశాల నుంచి వలసలను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించాం. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై నేను త్వరలోనే సంతకం చేయబోతున్నా..’’ అంటూ ట్రంప్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

 

- Advertisement -