25.2 C
Hyderabad
Friday, November 6, 2026
- Advertisement -
Home వార్తలు తెలంగాణ సంచలనం: తెలంగాణలో ఏ సీఎం అయినా.. మా ముందు తలవంచాల్సిందే: అక్బరుద్దీన్ ఒవైసీ

సంచలనం: తెలంగాణలో ఏ సీఎం అయినా.. మా ముందు తలవంచాల్సిందే: అక్బరుద్దీన్ ఒవైసీ

- Advertisement -

akbaruddin-owaisi

హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎవరైనా తమ ఎదుట తల వంచాల్సిందేనని ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) నేత అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో శనివారం ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ ఈ మేరకు ఆయన వ్యాఖ్యానించారు. సీఎం పీఠంపై ఎవరు కూర్చోవాలో నిర్ణయించేది మజ్లిస్ పార్టీయేనని అన్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి నుంచి చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య, కేసీఆర్ వరకూ అందరూ తమ మాటకు గౌరవం ఇచ్చారని అక్బరుద్దీన్ ఒవైసీ చెప్పారు.

అంతేకాదు, డిసెంబర్ 11 తర్వాత మజ్లిస్ బలమేంటో ప్రపంచం చూస్తుందని కూడా అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు. ‘‘మళ్లీ చెబుతున్నా.. తెలంగాణలో ముఖ్యమంత్రి ఎవరైనా మా ముందు తలవంచాల్సిందే..’’ అని ఆయన పునరుద్ఘాటించారు. తాను కింగ్ కాదనీ, కింగ్ మేకర్‌ననీ చెప్పుకున్నారు. గతంతో పోల్చుకుంటే రాష్ట్రంలో పరిస్థితులు మరింత సున్నితంగా మారాయనీ, ఈ సందర్భంలో మరింత జాగ్రత్తగా ఉండాలని అక్బరుద్దీన్ ఒవైసీ తమ పార్టీ కార్యకర్తలకు సూచించారు.

- Advertisement -