
హైదరాబాద్: బుధవారం అర్థరాత్రి నుంచి ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్‌ఆర్)పై వాహనాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి.
ఈ మేరకు ఓఆర్‌ఆర్‌పై వాహనాల రాకపోకలను అనుమతించాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ), హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్( హెచ్‌జీసీఎల్) నిర్ణయించాయి.
అయితే కర్ఫ్యూ వేళల్లో(రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు) మాత్రం ఓఆర్ఆర్‌పై కార్లను అనుమతించరు.
ఇక ఓఆర్‌ఆర్‌పై ప్రయాణించే సరకు రవాణా వాహనాల(గూడ్స్ వెహికిల్స్)లో ప్రయాణికులు ఉన్నట్లుగా టోల్‌ప్లాజా సిబ్బంది గుర్తిస్తే స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందజేయాలని సిబ్బందిని హెచ్ఎండీఏ అధికారులు ఆదేశించారు.
అయితే ప్రజా ఆరోగ్య రక్షణ చర్యల్లో భాగంగా ఓఆర్‌ఆర్‌పై టోల్‌గేట్ నిర్వహణ సిబ్బంది భద్రతా చర్యలు పాటించాలని నిర్దేశించింది. అలాగే, ఓఆర్ఆర్ టోల్ ప్లాజాల వద్ద ఫాస్ట్‌టాగ్ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
కరోనా లాక్‌డౌన్ కారణంగా ఔటర్ రింగ్ రోడ్డుపై రాకపోకలను నిలిపి వేసిన సంగతి తెలిసిందే.
అయితే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా బుధవారం అర్థరాత్రి నుంచి ఓఆర్‌ఆర్‌పై వాహనాల రాకపోకలను అనుమతిస్తున్నారు.
డిజిటల్ పేమెంట్ పద్ధతిలో ఫాస్ట్‌టాగ్ చెల్లింపులకు అవకాశం ఉంటుంది. వాహనదారులు వీలైనంత మేరకు నగదు రహిత లావాదేవీలకు ముందుకు రావాలని హెచ్ఎండీఎ సూచించింది.








