22.2 C
Hyderabad
Thursday, November 5, 2026
- Advertisement -
Home వార్తలు తెలంగాణ తప్పు చేయకపోతే తప్పించుకు తిరగడమెందుకు?: రవిప్రకాశ్ ఆరోపణలపై టీవీ9 కొత్త యాజమాన్యం

తప్పు చేయకపోతే తప్పించుకు తిరగడమెందుకు?: రవిప్రకాశ్ ఆరోపణలపై టీవీ9 కొత్త యాజమాన్యం

- Advertisement -

హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ బుధవారం తమపై చేసిన ఆరోపణలను ఆ చానల్ కొత్త యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. తాము అతడిపై పెట్టినవి తప్పుడు కేసులైతే.. అంత భయపడాల్సింది ఏముంది? పోలీసుల నుంచి తప్పించుకుని తిరగడం ఎందుకని ప్రశ్నించింది. 

ఆ చానల్ మాజీ సీఈవో రవిప్రకాశ్ బుధవారం ఒక వీడియో విడుదల చేసి, అందులో కొత్త యాజమాన్యంపై అనేక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో అతడి ఆరోపణలను ఖండిస్తూ టీవీ9 కొత్త యాజమాన్యం వివరణ ఇచ్చింది. 

చదవండి: మై హోమ్ రామేశ్వర్రావు చెప్పిందే హైదరాబాద్ పోలీసులు చేస్తారు: టీవీ9 రవిప్రకాశ్

టీవీ9 మాతృసంస్థ ఏబీసీఎల్‌లో 90 శాతానికి పైగా వాటాను మైహోమ్ రామేశ్వర్రావుకు చెందిన అలంద మీడియా సంస్థ కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో టీవీ9 కొత్త యాజమాన్యానికి ఆ చానల్ సీఈవోగా ఉన్న రవిప్రకాశ్‌కు మధ్య వివాదం తలెత్తింది. దీంతో టీవీ9 కొత్త యాజమాన్యం రవిప్రకాశ్‌ను పదవి నుంచి తొలగించడమేకాక అతడిపై మూడు కేసులు పెట్టింది.

టీవీ9 లోగో తన సొంతమని రవిప్రకాశ్ చెప్పడం సరైంది కాదని చానల్ కొత్త యాజమాన్యం పేర్కొంది. ఏబీసీఎల్ సంస్థలో మెజారిటీ వాటా లేకున్నప్పటికీ సంస్థలో పెత్తనం చెలాయించేందుకు రవిప్రకాశ్ ప్రయత్నించాడని కూడా ఆరోపించింది.

అంతేకాదు, అసలు తాను ఏ తప్పూ చేయనప్పుడు ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నాడో రవిప్రకాశ్ చెప్పాలని టీవీ9 కొత్త యాజమాన్యం సూటిగా ప్రశ్నించింది. 

చదవండి: పోలీసులకి దొరక్కుండా వ్యూహం.. 12 రోజుల్లో 30 సిమ్‌లు మార్చిన టీవీ9 రవి ప్రకాశ్…
- Advertisement -