22.1 C
Hyderabad
Sunday, November 8, 2026
- Advertisement -
Home వార్తలు తెలంగాణ పండుగ వేళ ఊరికెళ్లే వారికి తెలంగాణ ఆర్టీసీ శుభవార్త

పండుగ వేళ ఊరికెళ్లే వారికి తెలంగాణ ఆర్టీసీ శుభవార్త

- Advertisement -

హైదరాబాద్‌: నేటి నుంచి దసరా ప్రత్యేక బస్సులు పరుగులు పెట్టనున్నాయి. రేపటి నుంచి పాఠశాలలు, కళాశాలలకు సెలవుల ప్రారంభం కానుండడంతో శుక్రవారం ఎంజీబీఎస్‌, జూబ్లీబస్ స్టేషన్ల నుంచి ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు రంగారెడ్డి రీజియన్‌ ఆర్‌ఎం వరప్రసాద్‌ తెలిపారు.

నేటి నుంచి అక్టోబర్‌ 3 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ జిల్లాలకు 1,697 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. దసరా నేపథ్యంలో అడ్వాన్స్‌ రిజర్వేషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచుతామన్నారు.

ప్రయాణికుల రద్దీ, ట్రాఫిక్‌ దృష్టిలో పెట్టుకొని అక్టోబర్‌ 4 నుంచి శివారు ప్రాంతాల నుంచి జిల్లాలకు స్పెషల్‌ బస్సులు నడుపుతామని తెలిపారు.

దసరాకు టీఎస్ ఆర్టీసీ ఏపీ, తెలంగాణ జిల్లాలకు 4,933 బస్సులు నడుపుతోంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని వందకు పైగా అదనపు బస్సులు సిద్ధంగా ఉంచామని, ప్రయాణికుల రద్దీ పెరిగితే వాటిని జిల్లాలకు పంపించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు.

ప్రత్యేక బస్సుల వివరాలకోసం ఎంజీబీఎస్‌ ఫోన్‌ నెం.8330933419, 8330933537, 833933532లను, జేబీఎస్‌ పరిధిలో ఫోన్‌ నంబర్‌..040-27802203ను సంప్రదించాలని అధికారులు కోరారు.

- Advertisement -