23.2 C
Hyderabad
Saturday, November 28, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం.. మరో మూడు రోజులు వర్షాలే

కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం.. మరో మూడు రోజులు వర్షాలే

- Advertisement -

విశాఖపట్టణం: రాగల మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు.

 

దక్షిణ మహారాష్ట్ర, దానిని ఆనుకొని ఉన్న గోవా, కర్ణాటక, తూర్పు మధ్య అరేబియా సముద్ర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని నుండి బిహార్‌ వరకు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ ఆగ్నేయ ఉత్తరప్రదేశ్‌ మీదుగా ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతోంది.

 

తుపాను ప్రభావంతోనే వర్షాలు కురుస్తున్నాయని వస్తున్న వార్తల్లో నిజం లేదని వాతావరణ నిపుణుడు మురళీకృష్ణ విజ్ఞప్తి చేశారు.

- Advertisement -