24.2 C
Hyderabad
Friday, November 27, 2026
- Advertisement -
Home వార్తలు తెలంగాణ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధులని ఖరారు చేసిన కేసీఆర్….

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధులని ఖరారు చేసిన కేసీఆర్….

KCR Latest News, Telangana Election News, Telangana News, Newsxpressonline
- Advertisement -

హైదరాబాద్: స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేసే టీఆర్ఎస్ అభ్యర్ధులని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ఆదివారం అందుబాటులో ఉన్న మంత్రులు, నేతలతో భేటీ అయిన కేసీఆర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.

ఆ తర్వాత వరంగల్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నల్లగొండ నుంచి తేరా చిన్నపురెడ్డి, రంగారెడ్డి నుంచి పట్నం మహేందర్‌రెడ్డిని అభ్యర్థులుగా ప్రకటించారు. ఈ మేరకు ముగ్గురు అభ్యర్థులకు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ బీఫారాలను అందజేశారు.

చదవండి: జనసేన అభ్యర్థులతో పవన్ భేటీ! భవిష్యత్ కార్యాచరణపై చర్చ…

కాగా, మూడు ఎమ్మెల్సీస్థానాల ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల గడువు మంగళవారంతో ముగియనున్నది. 17న నామినేషన్ల ఉపసంహరణకు గడువు. పోలింగ్  మే 31న నిర్వహించనున్నారు. జూన్ 3న ఓట్లను లెక్కిస్తారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీపై ఏ నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ పోటీ చేస్తే…ఈరోజు ఆ పార్టీ అభ్యర్ధులని ఖరారు చేసే అవకాశం ఉంది.

చదవండి: వైసీపీ కేంద్రంలో భాగమైతే.. మంత్రులుగా ఛాన్స్ ఎవరికో తెలుసా?
- Advertisement -