26.2 C
Hyderabad
Friday, November 27, 2026
- Advertisement -
Home వార్తలు తెలంగాణ గుండెలు పిండే విషాదం: నిద్రిస్తున్న చిన్నారులపై కూలిన గోడ.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారుల...

గుండెలు పిండే విషాదం: నిద్రిస్తున్న చిన్నారులపై కూలిన గోడ.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారుల మృతి

- Advertisement -

హైదరాబాద్: ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులపై గోడ కూలిన ఘటనలో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్‌, హబీబ్‌నగర్ పరిధిలోని అఫ్జల్‌సాగర్ రోడ్డు మాన్‌గిరి బస్తీలో నిన్న రాత్రి జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం..

అఫ్జల్‌సాగర్‌ మాన్గార్‌ బస్తీలో రోజు కూలితో మిఠాయి లాల్, సీమ దంపతులు తమకున్న ఆదాయ వనరులతో పునాదులు లేకుండా సిమెంట్‌ ఇటుకలతో చిన్న శ్లాబ్‌ ఇల్లు నిర్మించుకున్నారు. అదే ఇంట్లో గబ్బార్, సురేఖ దంపతులు నివాసం ఉంటున్నారు.

మిఠాయిలాల్, సీమలకు రోష్ని (4), లక్ష్మీ (5) పావని (రెండు నెలలు) సంతానం కాగా గబ్బార్, సురేఖలకు వరలక్ష్మి (5), గీత (3), ఆరోల (2) పిల్లలుఉన్నారు. గురువారం రాత్రి 8 గంటల సమయంలో పిల్లలకు భోజనం తినిపించి నిద్రపుచ్చిన తల్లిదండ్రులు బయట వీధిలోకి వెళ్లారు.

 రాత్రి 10 గంటల సమయంలో గదిలోని వంట గది దిమ్మె వేడెక్కి గదికి మధ్యలో ఉన్న గోడపై పడింది. దీంతో ఆ గోడ ఒక్కసారిగా పిల్లలపై పడటంతో మిఠాయిలాల్‌ దంపతుల ముగ్గురు పిల్లలూ మరణించారు. అలాగే గబ్బార్‌ దంపతుల పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని నిలోఫర్‌కు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 
- Advertisement -