26.2 C
Hyderabad
Thursday, November 5, 2026
- Advertisement -
Home వార్తలు తెలంగాణ కరోనా ఎఫెక్ట్: 173 ఏళ్ల చేప ప్రసాదం పంపిణీకి బ్రేక్!

కరోనా ఎఫెక్ట్: 173 ఏళ్ల చేప ప్రసాదం పంపిణీకి బ్రేక్!

- Advertisement -

హైదరాబాద్: దేశంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. దీనిని అదుపులోకి పెట్టేందుకు కేంద్రం సహా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయినప్పటికీ మహమ్మారి విజృంభణకు అడ్డుకట్ట పడడం లేదు. 

 ఈ వైరస్ దెబ్బకు హైదరాబాద్‌లో 173 ఏళ్లుగా జరుగుతున్న చేప ప్రసాదం పంపిణీకి అడ్డుకట్ట పడింది. కరోనా వైరస్ కారణంగా 173 ఏళ్లుగా కొనసాగిస్తూ వస్తున్న చేప ప్రసాదాన్ని ఈసారి పంపిణీ చేయలేకపోతున్నామని దానిని పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ తెలిపారు. 

 ఈ ఏడాది కూడా చేప ప్రసాదాన్ని తయారీ చేస్తామని, కానీ పంపిణీ మాత్రం ఉండదన్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా అల్లోపతి మందులు వాడొద్దని సూచించారు. 

 ఈసారి కేవలం తమ కుటుంబ సభ్యులకు మాత్రమే ఈ ప్రసాదాన్ని పంపిణీ చేస్తామని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వ ఆదేశాలతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ రద్దు చేసుకున్నట్టు తెలిపారు. చేప ప్రసాదం పేరుతో ఎవరైనా పంపిణీ ఉందని చెబితే మోసపోవద్దని హరినాథ్ గౌడ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

- Advertisement -