తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా: రాజాసింగ్ సహా 38 మంది, పార్టీలో చేరిన రోజే వారికి…

amit-shah-narendra-modi
- Advertisement -

bjp-cec-meeting

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూడా జోరు పెంచింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో బహిరంగ సభలు నిర్వహించి ఎన్నికల సమరానికి సై కొట్టిన బీజేపీ అంతే వేగంతో అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించింది. 38 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. తాజా మాజీ ఎమ్మెల్యేలు ఐదుగురికి ఈ జాబితాలో చోటు దక్కింది.

శనివారం ఢిల్లీలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అధ్యక్షతన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్రమోడీతోపాటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డా.కె లక్ష్మణ్ తోపాటు పలువురు నాయకులు హాజరయ్యారు.  ఈ సమావేశంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపైనే ప్రధానంగా చర్చ జరిగింది.

తెలంగాణలో 119 స్థానాల్లో…

తెలంగాణలో 119 స్థానాల్లో పోటీ చేసే అంశంతోపాటు.. తెలంగాణ బీజేపీ రాష్ట్ర నాయకత్వం అందజేసిన అభ్యర్థుల జాబితా, ఆయా అభ్యర్థుల గెలుపు అవకాశాలపై కేంద్ర ఎన్నికల కమిటీ ప్రముఖంగా చర్చించింది. అనంతరం 38 మంది అభ్యర్థులతో కూడిన తొలిజాబితాను ప్రకటించింది. బీజేేపీ కేంద్ర ఎన్నికల కమిటీ విడుదల చేసిన అభ్యర్థుల తొలి జాబితాలో ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. అలాగే ఇటీవలే టీఆర్ఎస్ పార్టీలో చేరిన బాబూమోహన్ ఆందోల్ నుంచి బరిలోకి దిగనున్నారు. అదే విధంగా ఈ తొలివిడత జాబితాలో ముగ్గురు మహిళలకు కూడా చోటు కల్పించారు.

తెలంగాణతోపాటు…

తెలంగాణతోపాటు చత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన తొలి జాబితాను కూడా  ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించింది. చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి సంబంధించి 77 మంది అభ్యర్థులను, అలాగే మిజోరం రాష్ట్రానికి సంబంధించి 13 మంది అభ్యర్థులను ప్రకటించింది.

పార్టీలో చేరిన రోజే టిక్కెట్…

జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌ నేత డాక్టర్‌ జంగిలి వెంకట్‌, ఆయన సతీమణి జంగిలి సునీత శనివారం మధ్యాహ్నం అమిత్‌ షా సమక్షంలో బీజేపీలో చేరారు. ఇబ్రహీంపట్నం జడ్పీటీసీ సభ్యురాలైన సునీత  2009లో చిరంజీవి స్థాపించిన పీఆర్పీ తరఫున కోరుట్ల నుంచి బరిలోకి దిగి ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన జంగిలి దంపతులు శనివారం బీజేపీలోకి వచ్చారు.  పార్టీలో చేరిన సాయంత్రానికే వీరికి టిక్కెట్ ఖరారవడం విశేషం.

తెలంగాణలో.. ఏ స్థానం నుంచి ఎవరు?

ముషీరాబాద్ – డాక్టర్ కె. లక్ష్మణ్
అంబర్ పేట-జి.కిషన్ రెడ్డి
గోషామహల్-టి. రాజాసింగ్
ఉప్పల్ – ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
మాల్కాజిగిరి -ఎన్. రామచందర్ రావు
ఖైరతాబాద్ – చింతల రాంచంద్రారెడ్డి
ఎల్బీనగర్ – పేరాల శేఖర్ రావు
కార్వాన్ – టి.అమర్ సింగ్
మేడ్చెల్ – పి.మోహన్ రెడ్డి
మునుగోడు – డా.జి.మనోహర్ రెడ్డి
నిజామాబాద్ రూరల్ -కె.ఆనంద్ రెడ్డి
దుబ్బాక – ఎం.రఘునందన్ రావు
ముథోల్ -డా.పి. రమాదేవి
భద్రాచలం – కుంజా సత్యవతి
భూపాలపల్లి -డా.సిహెచ్.కీర్తిరెడ్డి
పరకాల -డా.పి విజయ చంద్రారెడ్డి
కామారెడ్డి -కె. వెంకటరమణారెడ్డి
బోథ్ – మడవి రాజు
సత్తుపల్లి -ఎన్.రామలింగేశ్వర రావు
పాలేరు – కొండపల్లి శ్రీధర్ రెడ్డి
సూర్యాపేట -సంకినేని వెంకటేశ్వరరావు
ఆదిలాబాద్ – పాయల్ శంకర్
ధర్మపురి -కె. అంజయ్య
మానకొండూర్ -జి. నాగరాజు
కోరుట్ల – డా.జి.వెంకట్
బెల్లంపల్లి -కె. ఇమాజీ
తాండూర్ – పటేల్ రవిశంకర్
నారాయణపేట్ -కె.ఆర్.పాండురెడ్డి
షాద్ నగర్ -ఎన్. శ్రీవర్థన్ రెడ్డి
మక్తల్ – బి.కొండయ్య
పినపాక డా. సంతోష్ కుమార్ చంద్
ఆర్మూర్ -పి. వినయ్ కుమార్ రెడ్డి
గద్వాల్-జి. వెంకటాద్రి రెడ్డి
అచ్చంపేట – మల్లేశ్వర్ మేడిపూర్
కల్వకుర్తి-టి.ఆచారి
కరీంనగర్ -బి.సంజయ్
పెద్దపల్లి -జి. రామకృష్ణారెడ్డి
ఆందోల్ – బాబూమోహన్

- Advertisement -