23.7 C
Hyderabad
Friday, November 27, 2026
- Advertisement -
Home వార్తలు తెలంగాణ 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. ఆర్థిక మంత్రిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న కేసీఆర్

9 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. ఆర్థిక మంత్రిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న కేసీఆర్

- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 9న బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్టు శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు పేర్కొన్నారు.

ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ రోజున ఉదయం 11:30 గంటలకు ఉభయ సభలు సమావేశమై బడ్జెట్ సమావేశాల పూర్తి ఎజెండాతోపాటు పనిదినాలను నిర్ణయిస్తారు.

అదే రోజున ఆర్థిక మంత్రిగానూ వ్యవహరిస్తున్న సీఎం కేసీఆర్ శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. శాసన మండలిలో ఓ మంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఆ మంత్రి ఎవరనేది తెలియాల్సి ఉంది.

నిజానికి బడ్జెట్ సమావేశాలను ఈ నెల 4, 9, 14 తేదీల్లో ఏ ఒక రోజున ప్రారంభించాలని ప్రతిపాదించారు. అయితే, అన్ని విషయాలు చర్చించిన అనంతరం చివరికి 9వ తేదీని నిర్ణయించారు.

- Advertisement -