యాదాద్రి సెక్స్ రాకెట్.. దిమ్మతిరిగే వాస్తవాలు!

sex-racket
- Advertisement -

హైదరాబాద్: యాదగిరిగుట్టలో సాగుతోన్న సెక్స్ రాకెట్‌కు సంబంధించి దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.  ఐదు నుంచి ఏడేళ్ల మధ్య వయసున్న బాలికలను కొనుగోలు చేసి.. వారికి ఇంటి పని నేర్పి, కొంత వయసు రాగానే వారిని నిర్వాహకులు వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారు. యాదగిరి గుట్టలోని పలు ఇళ్లపై దాడులు నిర్వహించిన పోలీసులు ఇప్పటి వరకూ 15 మంది చిన్నారులను రక్షించారు. వారిని వ్యభిచార ఊబిలోకి ఎలా దింపుతారనే విషయమై ఆ పసి మొగ్గలు చెప్పిన వాస్తవాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి.

వాస్తవానికి యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో వ్యభిచారం దందా దశాబ్దాలుగా సాగుతోంది. పసిపిల్లల అక్రమ రవాణాతో నిర్వాహకులు దీన్ని కొత్త పుంతలు తొక్కించారు. పోలీసులకు మామూళ్లు అందుతుండటం, ఎవరైనా ఫిర్యాదు చేస్తే తిరిగి వారినే బెదిరించడం.. ఇలాంటి ఘటనలతో ఈ దందాపై ఎవరూ నోరు మెదిపే ధైర్యం చేయడం లేదని తెలుస్తోంది.   అయితే పసిపిల్లలను వ్యభిచార కూపంలోకి దింపుతున్న విషయాన్ని పోలీసు యంత్రాంగం సీరియస్‌గా తీసుకోవడంతో.. ఇప్పుడు యాదాద్రిలో సాగుతోన్న సెక్స్ రాకెట్ మొత్తం బయటికి వచ్చింది.

బాలికలకు అశ్లీల వీడియోలు చూపిస్తూ…

వ్యభిచారంలోకి దింపడానికి ముందే నిర్వాహాకులు బాలికలను ముందే అందుకు మానసికంగా సన్నద్ధం చేస్తారట. పగలంతా ఇంటి పని చేయించి.. రాత్రి పూట ‘ఒంటి పని’కి సంబంధించిన అశ్లీల వీడియోలు చూపిస్తారట. ఆడ, మగ శృంగారంలో మునిగి తేలుతుండగా.. అదే గదిలో కూర్చోని చూడాలని చెబుతారట. ఇలా చూపించడం ద్వారా సెక్స్ అనేది పెద్ద తప్పు కాదనే భావనను వారిలో కలిగిస్తారట.

‘లైవ్’ చూడకుంటే శిక్షలే…

ఐదేళ్ల వయసున్న బాలిక కూడా ఓ జంట శృంగారంలో పాల్గొంటుంటే చూడాల్సి రావడం విస్మయానికి గురి చేస్తోంది. పగలంతా పనిచేసిన ఓ బాలిక అలసిపోయి నిద్రిస్తే.. అందుకు శిక్షగా వాతలు పెట్టారట. దీంతో మరుసటి రోజు నుంచి తన కళ్లెదురుగా సెక్స్ చేసుకుంటుంటే.. తాను అలా చూస్తుండిపోయానంటూ ఏడేళ్ల వయసున్న ఓ బాలిక ఏడుస్తూ చెప్పడంతో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు విస్తుపోయారట.

ఈస్ట్రోజన్ హార్మోన్‌ ఇస్తూ…

సెక్స్ గురించి ఒకవైపు మానసికంగా సన్నద్ధం చేయడంతోపాటు.. బాలికల్లో వయసుకు మించిన శారీరక ఎదుగుదల కోసం వారికి ఈస్ట్రోజన్ హార్మోన్‌ను ఇంజెక్షన్ల ద్వారా ఇస్తారట. దీంతో వారిలో శారీరక మార్పులు త్వరగా వచ్చేవి. ఇలా నిర్వాహకులు పసిమొగ్గలను శారీరకంగా, మానసికంగా తీవ్ర వేధింపులకు గురి చేసేవారట.

పోలీసులు దాడి చేసినప్పుడు…

యాదాద్రిలో వ్యభిచార గృహాలపై పోలీసులు దాడి చేసిన సందర్భంలో బాలికలను ఆయా ఇళ్లల్లోని గదుల్లో తవ్విన సొరంగాల్లో దాచిపెట్టి.. అవి బయటికి కనిపించకుండా వాటిపై మంచాలను ఉంచేవారట.  ఈ విషయాలన్నీ తెలిసిన తరువాత వ్యభిచార గృహాలను సీజ్ చేసిన పోలీసులు, వారానికోసారి కార్డన్ సెర్చ్ చేపట్టాలని నిర్వహించారు. ఈ దెబ్బతోనైనా.. యాదగిరిగుట్టలో వ్యభిచారం దందాను కూకటి వేళ్లతో సహా పెకిలిస్తారేమో చూడాలి మరి.

- Advertisement -