‘‘హీరోలకన్నా అందగాడు.. హిమాలయాలకన్నా ఆకర్షణీయుడు.. కేసీఆర్‌’’

ramgopal varma comments-kcr more handsome all heroes
- Advertisement -

ramgopal varma comments-kcr more handsome all heroes

హైదరాబాద్‌ : తెలంగాణ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌పై విలక్షణ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తనదైన శైలిలో ప్రశంసల జల్లు కురిపించారు.

‘సినీ హీరోయిన్ల కన్నా కేసీఆరే అందంగా ఉంటారని నేను ఎప్పుడు నమ్మేవాడిని, కానీ తాజా ఫలితాలు చూస్తే కేసీఆర్‌ సినీ హీరోల కన్నా అందగాడని, హిమాలయాలకన్నా ఆకర్షణీయుడనిపిస్తోంది..’’ అంటూ ట్వీట్‌ చేశారు.

అంతేకాదు, ‘‘గుజరాత్‌లో ప్రధాని నరేంద్ర మోడీ విగ్రహం పెడితే మాత్రం తెలంగాణలో దానికి రెండు రెట్లు కేసీఆర్‌ విగ్రహం పెట్టాలి..’’ అని వర్మ తన మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

అలాగే ఒక స్పూఫ్‌ వీడియోను కేటీఆర్‌కు ట్యాగ్‌ చేస్తూ.. ‘‘హే కేటీఆర్‌..  మీ డాడీ.. 2.0 కాదు.. రజనీకాంత్‌ కన్నా 20 రెట్లు.. మహేశ్‌ బాబు కన్నా 200 రెట్లు.. చంద్రబాబు నాయుడు కన్నా 2వేల రెట్లు ఎక్కువ..’ అని ట్వీట్‌ చేశారు. దీనికి కేటీఆర్‌ స్పందిస్తూ.. ఈ విషయం నాకప్పుడే తెలుసని బదులిచ్చారు.

అంతేకాకుండా తెలంగాణ ఎన్నికల్లో 88 సీట్లతో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న టీఆర్‌ఎస్‌, ఆ పార్టీ అధినేతపై సాధారణ ప్రజలు, రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ట్విటర్‌ వేదికగా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

స్టార్‌ హీరో మహేశ్‌ బాబు, మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌, డీఎంకే అధినేత స్టాలిన్‌, తదితరులు కేసీఆర్‌ను ప్రశంసిస్తూ అభినందనలు తెలుపుతూ ట్వీట్‌ చేయగా.. మంత్రి కేటీఆర్‌ వాటన్నిటికి స్పందింస్తూ ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -